రాష్ట్ర ఖజానా నింపడమే లక్ష్యంగా మందు ప్రియుల వీక్ పాయింట్‌ను సొమ్ము చేసుకునేందుకు రంగంసిద్ధం చేసింది. చల్లటి బీరు ముట్టుకోవాలంటే ఇప్పుడు జేబులు తడుముకునే పరిస్థితులు కల్పించింది. ఊహించని రీతిలో బీరు ధరలను పెంచేసింది. ఈ తంతు ఒక్క బీరుతోనే ఆగిపోయిందంటే అదీ లేదు. చీప్ లిక్కర్ నుంచి కాస్ట్లీ వైన్ వరకూ దేనినీ వదల్లేదు. అన్నిరకాల మద్యం ధరలను పెంచేసింది.
మందుబాబులుఎన్ని మార్లు ధరలు పెంచినా ఏమీ అనరని కాబోలు ఈ సారి కూడా మద్యం అమ్మకాల ద్వారా ఆదాయాన్ని సమకూర్చుకోవాలని సంకల్పించింది. ఆలోచన వచ్చిందే తడవుగా ధరలను పెంచుతూ అమలులో పెట్టింది. వేసవిలో బీరు విక్రయాలు జోరుగాసాగుతాయి. ఇదే వీక్ పాయింట్ ఆబ్కారీ శాఖకు ప్లస్ పాయింట్ అయింది. ఇప్పటికే రూ. 80 వరకు విక్రయిస్తున్న బీరు ధరలను రూ. 85 నుంచి 90 వరకు పెంచాలని నిర్ణయించింది.
బ్రాందీ, రమ్, జిన్, వోడ్కా, వైన్‌లాంటి మద్యంపైనా కరుణచూపలేదు. వెరైటీని బట్టి రేట్లు ఖరారు చేసింది. ప్రభుత్వం రూ. 4 నుండి 7 వరకు పెంచితే స్థానిక వ్యాపారులు మాత్రం రూ. 7 నుండి 9 వరకు పెరిగే అవకాశాలు ఉన్నట్లు చెబుతున్నారు