రాష్ట్రపతి పదవి దక్కలేదన్న అక్కసుతోనే కాంగ్రెస్ సీనియర్ నేత వెంకటస్వామి సోనియాగాంధీని విమర్శిస్తున్నారని తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ దివాకర్‌రెడ్డి మండిపడ్డారు. పీఆర్పీతో పొత్తు వైఎస్ఆర్ ఉన్నపుడు నుంచీ జరుగుతున్న ప్రక్రియేనని,అప్పట్లో వైఎస్ఆర్ చెప్పడంతో తానే వెళ్లి మాట్లాడివచ్చానని అన్నారు. 'పీఆర్పీతో పొత్తుతో సోనియాకు లాభంలేదు. కేవలం కాంగ్రెస్ పార్టీ ప్రయోజనాల కోసం పీఆర్పీతో పొత్తుకు ఉపక్రమించారు. ఆమె దయాదాక్షిణ్యాలపై పదవులు అనుభవిస్తూ విమర్శించడం తగదు. 'వెంకటస్వామిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాల్సిందే. ఆయన కుటుంబసభ్యులు వెంటనే పదవులకు రాజీనామాలు చేయాలి.