2, ఫిబ్రవరి 2011, బుధవారం

జగన్‌కు మద్దతు పలికిన వారి పునరాలోచన

కాంగ్రెస్ అధిష్ఠానం చర్యలకు రంగం సిద్ధం చేస్తున్నదని తెలియడంతో ఎవరిపై వేటు పడుతుందోనని జగన్ వర్గంలో గుబులు మొదలైంది. తొలి విడతగా కనీసం నలుగురైదుగురు ఎమ్మెల్యేలపై చర్య తీసుకోవాలని భావిస్తుండడంతో వారు ఎవరు కావచ్చుననే ఆరా మొదలైంది. జగన్‌తో పాటు ఓదార్పు యాత్రలో, విజయవాడ లక్ష్య దీక్ష, ఢిల్లీలో జల దీక్ష, విశాఖలో జన దీక్ష వేదికల్లో పార్టీకి, అధినేత్రికి వ్యతిరేకంగా ఎవరెవరు మాట్లాడారన్న పూర్తి సమాచారం ఢిల్లీకి చేరినట్టు సమాచారం.
అనకాపల్లి ఎంపి హరి రెండు నాల్కల ధోరణిని కూడా అధిష్ఠానం గుర్తించిందని.. . గతంలో ఒకసారి పార్టీ నుంచి బహిష్కారానికి గురయ్యారని, అదృష్టం బాగుండి కేవీపీ ఆశీస్సులతో టిక్కెట్ సంపాదించి ఎంపీగా ఎన్నికై దాన్ని కూడా నిలుపుకోలేకపోతున్నారని...ఇప్పుడు జగన్ వర్గంలో చేరి అధిష్ఠానానికి వ్యతిరేకంగా మాట్లాడడాన్ని ఆ పార్టీ వారంతా తప్పుపడుతున్నారు. తొలుత ఆవేశంగా జగన్‌కు మద్దతు పలికిన వారు ఇప్పుడు పునరాలోచనలో పడడం మరో విశేషం. అసలు సమయం వచ్చేసరికి ఎంత మంది అటువైపు ఉంటారో కచ్చితంగా చెప్పలేని పరిస్థితి. మొత్తానికి జగన్ వర్గంలో గుబులు మొదలైంది.