ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడేందుకు అందుబాటులో ఉన్న అన్ని మార్గాలనూ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ) అన్వేషిస్తోంది. కొత్త బస్సుల కొనుగోలుకు ప్రభుత్వం నుంచి భారీ సాయం కోసం ఒక వైపు యత్నిస్తూనే, మరోవైపు ఆర్టీసీకి విరాళమిచ్చిన పక్షంలో ఆయా సర్వీసులకు దాతలు సూచించిన పేర్లను పెట్టాలన్న ప్రతిపాదనలను అధికారులు పరిశీలిస్తున్నారు.
దాతలనుంచి ఆర్థిక సాయాన్ని పొందగలిగితే..కొంతమేరకైనా ఆ లోటును పూడ్చుకోవచ్చని.. వారెవరైనా విరాళమందిస్తే వారు సూచించిన పేర్లను నిర్ణీత కాలం వరకు గానీ సదరు సర్వీసులకు పెట్టాలన్నది ఆర్టీసీ భావిస్తోంది.