హిందీ చిత్రం త్రీ ఇడియట్స్‌కు రీమేక్‌గా శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రంలో కోయంబత్తూర్‌కు షిఫ్ట్ అయింది. అక్కడ అవినాసి రోడ్డులోని జెన్ని క్లబ్ ఎదురుగా ఊరేగింపు సన్నివేశాన్ని చిత్రీకరించారు. మార్వాడిల పెళ్లి ఊరేగింపు తరహాలో ఈ సన్నివేశాలను చిత్రీకరిస్తుండగా సమీపంలోని కళాశాల విద్యార్థులకు ఈ విషయం తెలిసి... గుంపులు గుంపులుగా వచ్చి షూటింగ్ ప్రాంతాన్ని రౌండప్ చేశారు. వాళ్లను అదుపు చేయడం సాధ్యం కాకపోవడంతో విజ య్, ఇలియానాలకు సంబంధించిన పాట షూటింగ్‌ను క్లబ్ లోపలికి మార్చారు శంకర్.