మియాపూర్ పోలీస్‌స్టేషన్‌లో ఓ నిందితుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. మెదక్ జిల్లా చెల్లాపూర్‌కు చెందిన ఓ హత్యకేసులో నిందితుడు మేకల అంజయ్య పీఎస్‌లోని బాత్‌రూమ్‌లో అతను ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు చెబుతున్నారు.
కాగా రెండు రోజుల క్రితం పోలీసులు అరెస్ట్ చేశారని.. పలురకాలుగా హింసించారని..పోలీసుల దెబ్బలు తాళలేకే అంజయ్య మృతి చెందాడని బంధువులు ఆరోపిస్తున్నారు.