తమిళనాడు ముఖ్యమంత్రి ఎం కరుణానిధి ఈ మేరకు ఓ ప్రకటన చేస్తూ, అంతర్జాతీయ మార్కెట్‌కు అనుగుణంగా భారతీయ చమురు సంస్థలు పెట్రోలియం ఉత్పత్తుల ధరలు పెంచాల్సి వచ్చిందన్నారు. అయితే రాష్ట్రంలోని ద్విచక్ర వాహన చోదకులకు సహకరించేందుకు పెట్రోల్‌పై విక్రయ పన్ను మూడు శాతం తగ్గించాలని నిర్ణయించినట్లు కరుణానిధి ఆ ప్రకటనలో తెలిపారు.
ఈ నిర్ణయం వల్ల ప్రభుత్వ ఖజానాకు ఏడాదికి రూ.210 కోట్ల రెవెన్యూ లోటు ఏర్పడుతుందని కరుణానిధి తెలిపారు. దీంతో రాష్ట్రంలో పెట్రోల్‌పై లీటర్‌కు రూ.1.38 తగ్గుతుంది. తమిళనాడు రాష్ట్ర శాసనసభకు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కరుణానిధి ప్రభుత్వ నిర్ణయానికి ప్రాధాన్యం ఏర్పడింది.