13, మార్చి 2011, ఆదివారం

మే నెలలో రాష్టప్రతి పాలన వచ్చేస్తోంది

మే నెలలో రాష్టప్రతి పాలన కిందకి రాష్ట్రం రానుందని ఆర్టీసీ మాజీ చైర్మన్ గోనె ప్రకాశరావు జోస్యం చెప్పారు. ఆదివారం ఆయన హైదరాబాదులో మీడియాలో మాట్లా డుతూ... ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి కాంగ్రెస్‌ అధిష్టానంని మెప్పించి తన పదవిని కాపాడుకునేందుకే కుయుకులు పనుతున్నారని వైఎస్ జగన్‌ను ఎలా అణచాలనే విషయం గురించే ఎప్పుడూ ఆలోచిస్తున్నారని అందువల్లే రాష్ట్రంలో ఎలాంటి పెను విధ్వంసాలు జరుగుతున్నా పట్టించుకోవట్లేదని విమర్శించారు. ఇప్పటికే గవర్నర్‌ ష్ట్ర పరిస్ధితిపై ఓ నివేదికని పంపించారని తనకు సమాచారముందని ఖచ్చితంగా మేనెలాఖరు నాటికి రాష్ట్రపతి పాలన విధించడం ఖాయమని రాష్ట్రంలో ప్రభుత్వం తగురీతిన పనిచేయట్లేదని... తెలుగుదేశం పార్టీ కూడా ప్రధాన ప్రతిపక్షంగా వ్యవహరించడం లేదని విమర్శించారు.

తెలంగాణా ఉద్యమంలో భావ వ్యకీకరణని ఎవరూ తప్పు పట్టలేరని.. అయితే తెలుగుదజాతి మహోన్నతిని చాటిన వారికి ప్రాంతీయ భేదాలు అంటగట్టి వారి విహాలను ధ్వంసం చేయటం తగదని తెలంగాణా ఉద్యమం పేరు చెప్పి కొందరు నేతలు విద్యార్థుల జీవితాలతో ఆడుకోంటున్నారని ఇది హేయమైన చర్యఅని విమర్శించారు. విదార్ధులు కూడా ఆలోచనతో ఆ నాయకుల ఉచ్చులో పడకుాడదని విజ్ఞప్తి చేశారు.