అందుబాటులోకి వచ్చిన అత్యంత ఆధునిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి 'దొంగలముఠా' చిత్రాన్ని తీశామని, ఈ విధానంలో సినిమాలు తీయడం ఎంతో శ్రేయస్కరమని దర్శకుడు రాంగోపాల్‌వర్మ స్పష్టంచేశారు. రవితేజ, చార్మి, ప్రకాష్‌రాజ్, లక్ష్మీప్రసన్న మంచు, బ్రహ్మానందం, సుబ్బరాజు ప్రధాన పాత్రధారులుగా శ్రేయ ప్రొడక్షన్స్ పతాకంపై కిరణ్‌కుమార్ కోనేరు నిర్మిస్తున్న ఈ చిత్రం ట్రైలర్స్ విడుదల కార్యక్రమం హైదరాబాద్‌లోని సినీమాక్స్‌లో జరిగింది. ఈ సందర్భంగా రాంగోపాల్‌వర్మ మాట్లాడుతూ, 'లోగడ వందరోజుల్లో కూడా సినిమా తీశాం. ఇప్పుడు ఈ సినిమాను ఐదురోజుల్లో తీస్తే ఎలా తీయగలుగుతున్నారని అడుగుతున్నారు.
ఈ నవీన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తే మూడురోజుల్లో తీయవచ్చు. క్వాలిటీతో పాటు ఖర్చు కూడా ఎంతగానో కలిసొస్తుంది. అందుకే దీనిని ఉపయోగించి ముందు ముందు సినిమాలు తీయబోతున్నాను. హిందీలో కూడా ఈ పరిజ్ఞానంతో సినిమాలు తీస్తాను' అని అన్నారు.