13, మార్చి 2011, ఆదివారం

'విదేశీ' కన్నా మన స్వదేశీ 'మందే' బెటర్

రాష్ట్రంలో విదేశీ మద్యం మందుబాబులకు కిక్కివ్వడం లేదు. అమ్మకాలు ఆశాజనకంగా లేవు. ఐదు నెలల కాలంలో 10 కేసులే అమ్ముడు పోయాయంటే అమ్మకాలు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ప్రభుత్వం 2010 అక్టోబర్ నుంచి విదేశీ మద్యాన్ని రిటైల్, బార్‌లో అమ్మకాలకు అనుమతి ఇచ్చింది. దీంతో మందుబాబులు విదేశీ మద్యం తమ ముంగిట్లోకి వస్తుందని మురిసిపోయారు.

ఒక బాటిల్ రూ.1800 నుంచి రూ.3500 పైబడి ఉండడంతో మందుబాబులు వీటి జోలికి వెళ్లేందుకు కూడా సంకోచిస్తున్నారు. అదే ఇండియన్ మేడ్ లిక్కర్‌లో కొంత కాస్లీ అయినప్పటికీ టీచర్స్-50, టీచర్స్, బ్లాక్‌డాగ్, 100 పైపర్స్ రూ.1000 నుంచి రూ. 1500 లోపు ధర ఉండటంతో ఉన్నత శ్రేణి మద్యం ప్రియులు విదేశీ మద్యంపై మక్కువ చూపకుండా స్వదేశీ బ్రాండ్‌నే తాగుతున్నారు.

మన సంబంధికులెవరైనా విదేశీ మద్యం తీసుకొస్తే వారికి ఇండియా కరెన్సీలో రూ.1500 నుంచి రూ.2వేల వరకు అక్కడ లభిస్తుంది. ఇండియాకు తీసుకువచ్చిన తరువాత నామమాత్రంగా రూ.200 నుంచి రూ.300 వరకు ఒక్కొక్క బాటిల్‌పై కస్టమ్ డ్యూటీ పడుతుంది.అదే ప్రస్తుతం మనకు మార్కెట్లో లభిస్తున్న విదేశీ మద్యం సెల్స్‌ట్యాక్స్, ఎక్సైజ్ డ్యూటీ కలుపుకుంటే రేట్టింపు ధరతో మనకు లభిస్తోంది. బ్లాక్‌లెబుల్ ధర రూ.3,500, రెడ్‌లెబుల్ ధర రూ.1800, శివాస్ రిగల్ రూ.3,500 ధరతో లభిస్తోంది.

ఈ ధరలు అధికంగా ఉండడంతో మన మందుబాబులు వాటిని కొనేందుకు వెనుకంజ వేస్తున్నారు.