13, మార్చి 2011, ఆదివారం

పెరుగుతున్న ఎండలు .. భయాందోళనలో జనాలు

ప్రకృతి ధర్మంలో భాగంగా ప్రతి ఏడు ఎండ, వాన, చలి, గాలి వాటి వాటి పనులు తుచాతప్పకుండా ఎవరి ఆదేశాల కోసం వేచిచూడకుండా వారి తడువు రాగానే వారి వారి పనులు చేసి వెళ్ళిపోవడం ఆనవాయితి. ఇందులో భాగంగా చలి తనదైన శైలిలో విజృంభించి మానవాళిని గజగజ వణికించి తన పని పూర్తి చేసుకొని తరువాత వంతు ఎండకు అప్పగించి వెళ్లడంతో సూర్య ప్రతాపం క్రమం క్రమంగా పెరుగుతూ ఎండ వేడిని పుట్టిస్తున్నడంతో ప్రజలు ఎండలకు బెంబెలేత్తూ పరుగులు తీస్తున్నారు.


గతంలో ఈ సమయంలో ఎప్పుడు లేనంతా ఎండ ఉష్టోగ్రతను ప్రజలు చూస్తూ రాబోయే కాలంలో ఈ ఎండ ప్రభావం ఏ మేరకు ఉంటుందో భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే యువత, చిన్నారులు ఎండ వేడిని తట్టుకోలేక సమీపంలో ఉన్న నీటి బావుల వద్దకు చేరుకొని ఎండ వేడికి జలకాలటలే శరణ్యం అంటూ వేడి ప్రతాపం నుండి ఉపసమనం పొందుతూ సేదతీరుతున్నారు. పట్టణంలో ఎండ వేడి తట్టుకోలేక ప్రజలు చెట్ల నీడలకు, దుకాణాల ముందు భాగాలకు చేరుతూ ఎండ వేడితో తడారిపోయిన శరీరానికి చల్లని పానియాలు, పుచ్చకాయలు, మజ్జిగ తదితర ద్రవ ప దార్థాలను సేవిస్తూ శరీరంలో తగ్గుతున్న నీటి శాతాన్ని పెంచుకోనేందుకు వారి వారి స్తోమతబ ట్టి సేవిస్తున్నారు.