13, మార్చి 2011, ఆదివారం

చేసింది అపచారం.. పైగా సమర్దిoపు


తెలుగు జాతి కీర్తి కిరీటాలను ప్రపంచ వినువీధుల్లో చాటి చెప్పిన తెలుగు మాగాణి ముద్దు బిడ్డల విగ్రహాలను ప్రాంతీయ విధేష్వాల పేరుతో ధ్వంసం చేసి హుసేన్‌సాగర్‌లో పడేయటాన్ని గర్హిస్తు తెలుగు భాషాభిమానులు టాంకుబాండ్‌పై నిరసన దీక్షకి దిగారు. ఆదివారం పలువురు రాజకీయ నేతలు, స్వచ్చంద సంస్ధల ప్రతినిధులు ఈ నిరసనలో పాల్గొని పోతనామాత్యుని విగ్రహం ముందు కూర్చొని నిరసన తెలిపారు. కృష్ణ దేవరాయులు, బ్రహ్మనాయుడు విగ్రహాల ను చూసి కన్నీళుల పెటుకునారు. తెలుగుజాతి ఔన్నత్యాన్ని చాటి చెప్పేందుకు జాతి కుల మత ప్రాంతీయ భేదాలకు అతీతంగా విదేశీయులైనా తెలుగువారికి మేలు చేకూర్చిన ప్రతి ఒక్కరినీ తెలువాళ్లంతా గుర్తుంచుకోవాలన్న ఒకే ఒక్క కాంక్షతో నాటి ముఖ్యమంత్రి వీటిని ఏర్పాటు చేస్తే .. విగహాలకు ప్రాంతీయ విధ్వేషాలు పులిమి కూల గొట్టడం... పైగా వారి ఔన్నత్యం తెలిసికూడా... విగ్రహాలే కదా? అన్న రీతిన మిలీయన్‌ మార్చ్‌ నిర్వాహకులు జరిగిన తప్పిందాన్ని సమరించుకోవటం శోచనీయమని ఈ నిరసనలో పాల్గొన్న పలువురు అభిపాయ పడ్డారు. అంతకు ముందు మహాత్ములారా! మన్నించండంటూ జనవిజాన వేదిక ఆధ్వర్యంలో టాంక్‌ బాండ్‌పై మౌన ప్రదర్శన జరిగింది.