13, మార్చి 2011, ఆదివారం

మూరుమూల గ్రామాలకు బ్యాంకింగ్‌ సేవలు


గ్రామీణ ప్రజలకు కూడా బ్యాంకింగ్‌ సేవలు అందుబాటులొకొస్తున్నాయి. మూరుమూల గ్రామాలకు కూడా బ్యాంకింగ్‌ సేవల్ని విస్తరింపజేస్తామని గతేడాది బడ్జెట్‌లో కేంద్రఆర్ధిక మంత్రి ప్రకటించారు. కాగా ఇవిప్పుడు కార్యరూపం దాలుస్తున్నాయి. ఏ బ్యాంక్‌ బ్రాంచ్‌లేని గ్రామాల్లో తొలుత సర్వీస్‌ పాయింట్లను ఏర్పాటు చేస్తారు. ఇందుకు భారతీయ స్టేట్‌ బ్యాంక్‌ ముందుకొచ్చింది. సర్వీస్‌పాయింట్లలో కలెక్టన్‌ ఏజెంట్లుగా నియామకాలకు ఇంటర్వ్యూలు ప్రారంభించింది. కనీసం 50వేలు పెట్టుబడి పెట్టగలిగి మరో 50వేలు బ్యాంక్‌కు డిపాజిట్‌ చేయగలిగిన నిరుద్యోగుల్ని ఈ సర్వీస్‌ సెంటర్లలో కలెక్టన్‌ ఏజెంట్లుగా ఎంపిక చేస్తున్నారు. గ్రామాల్లో ఒక చిన్న షాప్‌ను అద్దెకు తీసుకుని ఈ సర్వీస్‌పాయింట్లు నెలకొల్పుతారు. ఆయా గ్రామాల్లోని డ్వాక్రా మహిళల నుంచి వాయిదాలు కట్టించుకోవడం, అప్పులివ్వడం, గ్రామస్థులకు సేవింగ్స్‌ బ్యాంక్‌ అకౌంట్లు తెరవడం వంటి చిన్న చిన్న పనుల్ని ఇక్కడ అప్పటికప్పుడు పూర్తిచేస్తారు. ఇందుకోసం సర్వీస్‌ సెంటర్ల నిర్వాహకులకు నిర్ణీత మొత్తంలో కమిషన్లు చెల్లిస్తారు. కనీసం ఇంటర్‌ పాసైన నిరుద్యోగుల్ని ఈ ఉద్యోగాలకు ఎంపికచేస్తున్నారు. శుక్రవారం నుంచి కాకినాడ స్టేట్‌బ్యాంక్‌ అడ్మినిస్ట్రేటీవ్‌ కార్యాలయంలో ఇంటర్వ్యూలు మొదలయ్యాయి. ఈ నెలాఖరులోగా ఎంపిక పూర్తి చేసి గ్రామాలకు బ్యాంక్‌ సేవల్ని విస్తరించనున్నారు.