రాబోయే ఉగాది పండుగ నూతన పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రతి హిందూవు ప్రతి ఇంటిపై, ప్రతి గ్రామ కూడలిలో కాషాయ ధ్వజాలు ఎగురవేయాలని విశ్వహిందూ పరిషత్ పిలుపునిచ్చింది.నగరంలో మార్చి 27న సామూహికంగా ఇతిచింతక్ నిర్వహించాలని, మే 8నుండి 23వరకు జరిగే విహెచ్‌పి శిక్షణ వర్గ్‌లో ప్రతి గ్రామం నుండి 5మంది చొప్పున పాల్గొనాలని, ఈ నెల 19 సందర్భంగా పౌర్ణమి ఉంటుందని, అందుకు మనం కాముని పౌర్ణమిగా ఆ రోజు రాత్రి 10గంటలకు కామదహన కార్యక్రమాన్ని నిర్వహించి హోలీ మహోత్సవాన్ని ఈనెల 20న ఆదివారం జరుపుకోవాలని విశ్వహిందూ పరిషత్ వెల్లడించింది.