భారత ప్రధాని మన్మోహన్ క్రికెట్ దౌత్యం ఫలించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. మొహాలీలో ఈ నెల 30న జరిగే భారత్-పాక్ క్రికెట్ వరల్డ్‌కప్ సెమీ ఫైనల్ మ్యాచ్‌ను తిలకించేందుకు రావాలని మన్మోహన్ పంపిన ఆహ్వానానికి ప్రధాని గిలానీ అంగీకరించవచ్చని సంకేతాలు వచ్చాయి. ఉజ్బెకిస్థాన్ పర్యటనలో ఉన్న గిలానీకి ఈ ఆహ్వానం గురించి అధికారులు తెలపగా ఆయన చిర్నవ్వు చిందించార ని సమాచారం. మొహాలీకి వెళ్లే అంశంపై ఆయన తమ అధికారులతో చర్చించారని పాక్ మీడియా కథనం.