ముఖ్యమంత్రి బీఎస్.యడ్యూరప్ప, ఆయన కుటుంబసభ్యులు, రాష్ట్ర హోం మంత్రి ఆర్.అశోక్‌లపై లోకాయుక్త పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదుకు సిద్ధమయ్యారు. సోమవారం లేదా మంగళవారం ప్రథమ సమాచార నివేదికను నమోదు చేసే అవకాశాలున్నాయి. ప్రత్యేక న్యాయస్థానం ఇచ్చిన తీర్పు ఆదేశాల మేరకు ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడానికి న్యాయ నిపుణులతో లోకాయుక్త పోలీసులు చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.
లోకాయుక్త న్యాయ నిపుణుడు చంద్రశేఖర్ సెలవుపై మైసూరు వెళ్లినందున ఆయన వచ్చిన తరువాత చర్చించి సీఎం,హోం మంత్రిపై ఎఫ్‌ఐఆర్ దాఖలు చేయాలా..? వద్దా..? అనేది సోమవారం నిర్ణయిస్తామని లోకాయుక్త ఏడీజీపీ రూప్‌కుమార్ దత్తా తెలిపారు.