ముస్లింల సాధికారిక విధానాన్ని(ఎంపవర్‌మెంట్ పాలసీ) తెలుగుదేశం పార్టీ
అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు గురువారం ప్రకటించారు. శాసనసభలో
ముస్లింలకు 15 ఎమ్మెల్యేల సీట్లు రీజర్వు చేయనున్నట్లు ప్రకటించారు. అలాగే
ముస్లిం మహిళలకు కేజీ నుండి పీజీ వరకు ఉచిత విద్యను కల్పించాలని చంద్రబాబు
నిర్ణయించారు.
నిరుద్యోగ మైనారిటీ యువతకు స్వయం ఉపాధి పథకాలు, ముస్లింల ఆర్థికాభివృద్ధికి, సామాజికభ్యున్నతికి వీలుగా వార్షిక బడ్జెట్‌లో రూ. 2,500 కోట్లు కేటాయించాలని చంద్రబాబు నాయుడు మైనారిటీ విధాన నిర్ణయంగా ప్రకటించారు.