తెలంగాణ ఉద్యమం తీవ్రస్థాయికి చేరుకుంటే ఢిల్లీలో కేసీఆర్ ఏమి
చేస్తున్నారని మావోయిస్టు అధికార ప్రతినిధి జగన్ అన్నారు. కేసీఆర్ తీరుపై
జగన్ అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఢిల్లీ నుంచి వచ్చి తెలంగాణ మార్చ్
విజయవంతం చేయడానికి కృషి చేయాలని కేసీఆర్ కు విజ్ఞప్తి చేశారు. అంతేకాక
తెలంగాణ మార్చ్‌ను విజయవంతం చేయండని ప్రజలకు పిలుపునిచ్చారు. అంతేకాక
తెలంగాణపై తాజాగా చంద్రబాబు లేఖ ఇవ్వడాన్ని డ్రామా కొట్టిపడేశారు.
చంద్రబాబు పచ్చి అవకాశవాది అని జగన్ విమర్శించారు.