రత్యేక తెలంగాణపై రాష్ట్రంలో ఏకాభిప్రాయం లేదని ముఖ్యమంత్రి
కిరణ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర కాంగ్రెస్‌లోనే తెలంగాణపై
భిన్నాభిప్రాయాలు ఉన్నాయని చెప్పారు. విభజనపై తీవ్ర వ్యతిరేకత వస్తోందని,
ఏకాభిప్రాయం ద్వారానే సమస్యకు పరిష్కారం లభిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.
తెలంగాణ నిర్ణయంపై కేంద్రానికి గడువు విధించలేమని, స్వేచ్చగా నిర్ణయం
తీసుకునేందుకు కేంద్రానికి అవకాశం ఇవ్వాలని సీఎం కోరారు. తెలంగాణ రాష్ట్ర
ఏర్పాటుపై అన్ని పార్టీలతో కేంద్రం చర్చించాల్సి ఉందన్నారు.