ఆదివారం అంటే గవర్నమెంట్ ఉద్యోగస్తులకు
తెగ ఆనందం. ప్రతిరోజూ ఆఫీసులో చేసేది ఏమీలేనప్పటికీ, విధిగా ఆదివారం మాత్రం
ఎంజాయ్ చేయాలనే ఉద్దేశంతో ఉన్న అనేకమందిలో సత్యమూర్తి ఒకరు. మార్నింగ్
ఇంట్లో పేపర్ చదువుతూ కాఫీ తాగుతు న్నాడు. భార్యతో సండే ప్రోగ్రామ్స్
గురించి చర్చించాడు. 'సండే రోజున ఎవరైనా పెళ్ళికి పిలిస్తే బావుండు.
ఎంచక్కా భోజన ఖర్చులు కలిసివచ్చేవి అనుకున్నాడు' మనసులో. ఇంతలో కాలింగ్
బెల్ మోగింది. ''సండే నాడు ఎవరా అనుకుంటూ'' విసుగ్గా తలుపుతీశాడు. ఎదురుగా
కొరియర్ బాయ్ చిరునవ్వులు చిందిస్తూ ''గుడ్‌మాణింగ్ మీకు కొరియర్
వచ్చింది'' అంటూ సిన్సియర్‌గా చెప్పాడు.
కొరియర్ అనగానే సత్యమూర్తి కళ్ళలో మెరుపు మెరిసింది. అనారోగ్యంతో ఉన్న తన అత్తయ్య ఢమాల్‌మని కొంతకాలమైంది. ఆస్తి కాగితాలు పంపిందేమో అనుకుంటూ కొరియర్ ఇచ్చిన కవర్ ఆతృతగా విప్పబోయాడు. ప్రమాదాన్ని శంకించిన కొరియర్ బాయ్ టక్కున మూర్తి చేతిలోని కవర్ లాక్కున్నాడు. మూర్తి వంక అనుమానంగా చూశాడు. ''సత్యమూర్తి అంటే నిజంగా మీరేనా?'' డౌట్‌తో అడిగాడు.
''అవునవును ఎందుకలా అడిగావ్?''
''సైన్ చేయకుండా కవర్ చించేస్తుంటే అనుమానం వచ్చింది. ఎందుకైనా మంచిది మీ ఐడీ కార్డు చూపించండి'' అంటూ కవర్‌ను వెనక దాచేసుకున్నాడు.
సత్యమూర్తికి ఆవేశం వచ్చేసింది. తమాయించుకున్నాడు. తానే తొందరపడినట్టు గ్రహించాడు. కూల్‌గా ''చూడు మిస్టర్.. జస్ట్ కవర్‌లో ఏముందో చూడాలనే టెన్షన్‌తో అలా చేశానన్నమాట. అందుకే చింపబోయాను. నిజంగా నేనే సత్యమూర్తినయ్యా, కావాలిస్తే నేమ్‌బోర్డు చూడు'' అంటూ గోడకున్న తన నేమ్‌బోర్డును చూపించాడు. దాంతో కొరియర్ బాయ్ శాంతించాడు. సంతకం తీసుకుని, కవర్ ఇచ్చేశాడు. బాయ్ వీధి మలుపు తిరిగాక, కవర్ ఓపెన్ చేశాడు. అందులో మూర్తి ఆశించినట్టు ఆస్తి కాగితాలు లేవు. శుభలేఖ ఉంది. ఫ్రమ్ అడ్రస్ చూశాడు. తన బంధువు.. వరుసకు బాబాయ్ అవుతాడు. అతని కుమారుడి పెళ్ళి అని అర్థమైంది. భర్తచేతిలో శుభలేఖ చూసి ఆనందంగా దగ్గరకు వచ్చింది భార్య ప్రసూన. ''పెళ్ళి ఎవరిదండీ.. మొన్న కొనుక్కున్న పట్టుచీర కట్టుకుంటాను'' అని ఆతృతగా అంది.
సత్యమూర్తి మాత్రం ఎలాంటి భావాలు పలికించకుండా ఉన్నాడు. దానికి కారణం శుభలేఖతో పాటుగా కనిపించిన లెటర్. శ్రీమతి అండ్ శ్రీ అని ప్రింట్ చేసివుంది. ఆ పక్కన సత్యమూర్తి పేరును పెన్నుతో రాశారు. మిగతా మ్యాటర్ మొత్తం ప్రింటింగ్‌లో ఉంది. శుభలేఖతో పాటుగా ఇలాంటి లెటర్ రావడం ఆశ్చర్యం కలిగించింది. ప్రసూన కూడా సేమ్ ఎక్స్‌ప్రెషన్ ఇచ్చి ''లెటర్ ఏమిటండీ?'' ఉండబట్టలేక అడిగేసింది.
''నేనూ అదే చూస్తున్నాను. సరే లెటర్ చదివి చెబుతాను'' అంటూ కుర్చీలో రిలాక్స్‌డ్‌గా కూర్చుంటూ అన్నాడు.
''నో నో నేను కూడా చదువుతాను. శుభలేఖతో లెటర్ అంటే టీవీ సీరియల్‌లో ఉన్నంత ట్విస్ట్ ఉందనిపిస్తోంది. 'చావులేఖా.. శుభలేఖా' సీరియల్లో హీరోయిన్ ఇలాగే చేసిందండి..''
''అబ్బ ఇప్పుడు కూడా సీరియల్స్ గురించేనా కాస్త కుదురుగా ఉండు లెటర్ చదివేస్తాను'' విసుగ్గా అన్నాడు మూర్తి.
''మళ్ళీ మాట తప్పుతున్నారండీ ఇద్దరం కలిసి చదువుదాం నాకు టెన్షన్‌గా ఉంది''
భార్య తన మాట వినదని గ్రహించిన సత్యమూర్తి ఎప్పటిలాగే కాంప్రమైజ్ అయ్యాడు. ''సరే ఇద్దరం కలిసే చదువుకుందాం. కాస్త కాఫీ తీసుకురా''
భర్త ఎత్తుగడ తెలిసిన ప్రసూన ''అబ్బ ఆశ.. కాఫీ తేవడానికి నేను వెళ్ళగానే మీరు లెటర్ చదివేస్తారు. ఆ పప్పులేం ఉడకవ్. నిజంగా కాఫీ కావాలంటే ఆ లెటర్ ఇటు ఇచ్చేయండి. కాఫీతో వచ్చాక ఇస్తాను''
ఇకలాభం లేదనుకున్నాడు సత్యమూర్తి. ''సరే మనిద్దరి డిస్కషన్ వల్ల ఆల్‌రెడీ హాఫెనవర్ వేస్ట్ అయింది'' అంటూ ఇద్దరు కలిసి లెటర్ చదవడానికి ఉపక్రమించారు.
''శ్రీ, శ్రీమతి సత్యమూర్తిగారికి నమస్కారాలు. శుభలేఖలో నా పెళ్ళి డీటెయిల్స్ ఉన్నాయి. నెక్ట్స్ సండే నా పెళ్ళి...'' అని చదువుతూ, మధ్యలో ఆపి, భార్యవంక చూసి ''వచ్చే ఆదివారం మనకు ఫుడ్ ఖర్చు తగ్గిందే. ఎంచక్కా పెళ్ళికి వెళ్ళిరావచ్చు'' అన్నాడు మూర్తి.
లెటర్ చదువుతుంటే మధ్యలో బ్రేక్ వేయడం నచ్చలేదు ప్రసూనకు. ''అబ్బ ఎప్పుడూ తిండిధ్యాసే మీకు. ముందు లెటర్ కంటిన్యూ చేయండి'' అన్నది.
మూర్తి కంటిన్యూ చేయసాగాడు. ''నేడు అందరూ బిజీగా ఉంటున్నారు. వారి పర్సనల్ లైఫ్‌ను డిస్టర్బ్ చేయడం నాకు ఇష్టం ఉండదు. అమెరికాలో, ఆస్ట్రేలియాలో కూడా ఇంతే. దాన్నే నేను ఫాలో అవుతున్నాను....'' మళ్ళీ మూర్తికి డౌట్ వచ్చింది. 'ఇంతకీ వీడు ఏం చెప్పబోతున్నాడు?' అనే అనుమానం వ్యక్తపరుస్తూ భార్య వైపు చూశాడు.
ప్రసూన కళ్ళు మిటకరించడంతో సిన్సియర్‌గా లెటర్ చదవడం కంటిన్యూ చేయసాగాడు. ''...అందువల్ల నేను పెళ్ళికి పిలిచానని భావించవచ్చు. పిలిచి మీ పర్సనల్ టైమ్ వేస్ట్ చేయలేను. అందుకే జస్ట్ నేను పెళ్ళి చేసుకుంటున్న విషయాన్ని మాత్రమే మీకు ఇన్‌ఫామ్ చేస్తున్నాను. ఆఫ్ఘనిస్తాన్, కజికిస్థాన్‌లో కూడా ఇలాగే ఇన్‌ఫామ్ చేస్తుంటారు. అందుకే నేను మీకిలా తెలియజేస్తున్నాను...'' లెటర్ చదువుతున్న సత్యమూర్తి ఫేసులో రంగులు మారసాగాయి. భర్త ముఖంలో రంగుమారడం ప్రసూనకు తెగ ఆనందం కలిగింది. ''ఏవండేవండీ మీ ఫేస్ బ్లాక్ కలర్ నుండి రోజ్ కలర్‌కు మారుతోంది. అబ్బ తెగ ముద్దొస్తోంది. కనీసం మన పెళ్ళి రోజైనా ఇలా రోజ్ కలర్‌లో కనిపించవచ్చుకదా!'' మురిపెంగా అడిగింది. ఊసరవెల్లిలా భర్త కలర్స్ మార్చడం ఆమెకు ఆశ్చర్యం కలిగిస్తోంది.
సత్యమూర్తి మాత్రం ఇవేమీ పట్టించుకోవడం లేదు. లెటర్ లోని విషయాలే చిత్రంగా అనిపిస్తూ, ప్రమాదసూచికను తెలియజేస్తున్నాయి. ధైర్యం తెచ్చుకుని లెటర్ కంటిన్యూ చేయసాగాడు ''...అందువల్ల జస్ట్ శుభలేఖ ద్వారా నా పెళ్ళి విషయాన్ని మాత్రమే మీకు తెలియజేస్తున్నాను. అయితే నా పెళ్ళి చూడాలని మీకు తెగముచ్చటగా ఉండవచ్చు. అందుకే పెళ్ళైన మరుక్షణమే వీడియోను యూ ట్యూబ్‌లో పెడతాను. ఇంకా నా బ్లాగ్‌లో కూడా ఉంటుంది. డబ్ల్యూ డబ్ల్యూ డబ్ల్యూ డాట్ సర్వం బ్లాగ్‌స్పాట్‌లో చూడండి. వన్ వీక్ తర్వాత మీ ఇంటికి కొరియర్‌లో మా పెళ్ళి సీడీ పంపిస్తాను...'' లెటర్ చదువుతున్న సత్యమూర్తి చేతులు వణికాయ్. కోపం హండ్రెడ్ డిగ్రీలకు చేరుకుంది. భర్తతో పాటుగా లెటర్ ఫాలో అవుతున్న ప్రసూనకు కూడా కోపం వచ్చినా అది కొద్దిసేపే. ''ఏవండీ ఈ ఐడియా బావుంది కదూ... మనబ్బాయిలకు కూడా ఇదే ఫాలో అవుదామా'' ఉత్సాహంగా అడిగింది. భార్య అడిగిన ప్రశ్నతో సత్యమూర్తి కోపం ఒక్కసారిగా జీరో డిగ్రీలకు పడిపోయింది. లెటర్ పూర్తిగా చదివేశాక తన నిర్ణయం ప్రకటిద్దామనుకున్నాడు. ''....మా పెళ్ళి సీడీ చూశాక సేమ్ బ్లాగ్‌కు మీ అభిప్రాయాలను పోస్ట్ చేయండి. పెళ్ళికి రాలేదని, గిఫ్ట్‌లు ఇవ్వలేదని, పెళ్ళి భోజనం చేయలేదనే బాధ మీలో ఉంటుందని నాకు తెలుసు. అందుకే మీరు ఇవ్వాల్సిన గిఫ్ట్‌లకు ఒక సౌకర్యం ఏర్పాటు చేశాను. డీటెయిల్స్ నా బ్లాగ్‌లో ఉంటాయి. ఇక పెళ్ళి భోజనం చేసే వీలు కూడా కల్పించాను. శుభలేఖతో పాటుగా నాలుగు భోజనం టికెట్స్ పంపిస్తున్నాను. ఇవి నాలుగువారాలు చెల్లుబాటులో ఉంటాయి. మీరెప్పుడైనా అమీర్‌పేట్ వచ్చినపుడు అక్కడ మెస్‌లో ఈ భోజనం టికెట్స్ ఇచ్చి భోంచేయండి. ఇట్లు మీ వీధేయుడు సూర్యనారాయణమూర్తి'' అని ఉంది. లెటర్ పూర్తిగా చదివాక సత్యమూర్తి, ప్రసూన దంపతుల ముఖంలో మల్టిdకలర్స్ కనిపించసాగాయి. శుభలేఖ వంక దానివెంట వచ్చిన లెటర్ వంక వారిద్దరూ ఎగాదిగా చూడసాగారు.

- రామనారాయణరాజు