ఇద్దరు ప్రముఖులు రూ.100 కోట్ల కోసం తనను బ్లాక్‌మెయిల్ చేసి కుట్ర పన్ని ఈ కేసులో ఇరికించి జైలుకు పంపారని ధ్యానపీఠాధిపతి నిత్యానంద స్వామి ఆరోపించారు. సిఓడి పోలీసులకు ఈ వివరాలు చెప్పినా వారు విని ఊరుకున్నారని ... తనకు ప్రాణభయం ఉన్నందున ప్రస్తుతానికి వీరి పేర్లను వెల్లడించలే కపోతున్నట్లు చెప్పారు.
ప్రపంచవ్యాప్తంగా తనకు కోటి మంది భక్తులు ఉన్నారని తనపై సినీనటి రంజిత రాసలీలల వ్యవహారం పూర్తిగా కట్టుకథ .. నీచమైన ఆరోపణలు వచ్చినప్పటికీ భక్తులు పట్టించుకోవడంలేదని నేటికీ లక్షల సంఖ్యలో తమ ఆశ్రమానికి వస్తూనే ఉన్నారని... ఇప్పటికీ ఇంటర్నెట్‌లో తానే అందరికన్నా పాపులర్ గురువునని నిత్యానంద చెప్పుకున్నారు.
1, ఫిబ్రవరి 2011, మంగళవారం
చిరంజీవినీ ముంచేస్తుంది
కాంగ్రెస్ పార్టీ మునుగుతూ.. చిరంజీవినీ ముంచేస్తుందన్నారు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ. కాంగ్రెస్‌పార్టీ మునిగిపోయే పడవ అని, చిరంజీవి ఆ పడవను ఎక్కితే బరువెక్కువవుతుందే కానీ.. తేలదని ఎద్దేవా చేశారు. . కేంద్రంలో, రాష్ట్రంలో కాయకల్ప చికిత్స చేసి కాంగ్రెస్‌ను నిలబెట్టుకోవాలని చూస్తున్నారని, వాస్తవానికి కాయకల్ప చికిత్స వల్ల రోగం పూర్తిగా నయం కాదని.. లోన కుళ్లి పోతుంటే పైన సుగంధ ద్రవ్యాలు చల్లితే ఉపయోగం ఉండదు' అని ఎద్దేవా చేశారు.
కాంగ్రెస్, ప్రజారాజ్యంల సహజీవనం ఎప్పటి నుంచో
పెళ్ళి కాకుండా కాంగ్రెస్, ప్రజా రాజ్యం పార్టీలు ఎప్పటి నుంచో సహజీవనం చేస్తున్నాయని, ఇప్పుడు అధికారికంగా తాళి కట్టుకొందామని అనుకొంటున్నాయని బుచ్చయ్య చౌదరి వ్యాఖ్యానించారు.
ఇతర పార్టీలోని పరిణామాలతో తమకు సంబంధం లేదని, తమ పని తాము చేసుకొంటూ పోతామని ఆయన చెప్పారు. ఒకరి కోసం అవిశ్వాసాలు పెట్టాల్సిన అవసరం తమకు లేదని...తమ వ్యూహం ప్రకారం తాము ముందుకు వెళ్తామన్నారు. రాష్ట్రంలోని అనిశ్చితితో మొత్తం రాష్ట్రం నష్టపోతోందని, శ్రీకృష్ణ కమిటీ నివేదికలోని అంశాలను పరిగణనలోకి తీసుకొని కేంద్రం వెంటనే ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని ఆయన కోరారు.
ఇతర పార్టీలోని పరిణామాలతో తమకు సంబంధం లేదని, తమ పని తాము చేసుకొంటూ పోతామని ఆయన చెప్పారు. ఒకరి కోసం అవిశ్వాసాలు పెట్టాల్సిన అవసరం తమకు లేదని...తమ వ్యూహం ప్రకారం తాము ముందుకు వెళ్తామన్నారు. రాష్ట్రంలోని అనిశ్చితితో మొత్తం రాష్ట్రం నష్టపోతోందని, శ్రీకృష్ణ కమిటీ నివేదికలోని అంశాలను పరిగణనలోకి తీసుకొని కేంద్రం వెంటనే ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని ఆయన కోరారు.
'కెసిఆర్ తాతలు బొబ్బిలిలో ఏం పేడ తిన్నారు?
టిఆర్ఎస్ అధ్యక్షుడు కెసిఆర్ వాడుతున్న పదజాలం చూస్తే ఆయనను పిచ్చి కుక్క కరిచినట్లుందని తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి గోరంట్ల బుచ్చయ్య చౌదరి వ్యాఖ్యానించారు. 'కెసిఆర్ తాతలు బొబ్బిలిలో ఏం పేడ తిన్నారు? కెసిఆర్ గతంలో టిడిపిలో ఉన్నప్పుడు రాజమండ్రి, తిరుపతి, విశాఖపట్నం వచ్చినప్పుడు ఆరంగారంగా పులుసుకూరలు, చేపల పులుసులు, బిర్యానీలు తిన్నారు.
అవన్నీ పేడేనా? కెసిఆర్ తాతలు వలస వచ్చినట్లే అనేక మంది చదువులు, ఉద్యోగాలు, ఉపాధి కోసం హైదరాబాద్‌కు వలస వచ్చారు. ఇక్కడకు సీమాం«ద్రులే రాలేదు. తెలంగాణ ప్రజలు సహృదయులు...నిస్వార్ధపరులని, వారి మనసులను కెసిఆర్ విషపూరితం చేస్తున్నారని ఆయన ఆరోపించారు.
అవన్నీ పేడేనా? కెసిఆర్ తాతలు వలస వచ్చినట్లే అనేక మంది చదువులు, ఉద్యోగాలు, ఉపాధి కోసం హైదరాబాద్‌కు వలస వచ్చారు. ఇక్కడకు సీమాం«ద్రులే రాలేదు. తెలంగాణ ప్రజలు సహృదయులు...నిస్వార్ధపరులని, వారి మనసులను కెసిఆర్ విషపూరితం చేస్తున్నారని ఆయన ఆరోపించారు.
పీఆర్పీ అంటే 'పీపుల్ రిజక్టెడ్ పార్టీ
చిరంజీవి మాట్లాడితే కొన్ని చోట్ల బోర్డుల్లో ఉన్నట్లు 'మే ఐ హెల్ప్ యూ' అంటూ కాంగ్రెస్ పార్టీ ఆఫీసు చుట్టూ తిరుగుతున్నారని పీఆర్పీ అంటే 'పీపుల్ రిజక్టెడ్ పార్టీ అని మాజీ మంత్రి ఎం.మారెప్ప కొత్త నిర్వచనం ఇచ్చారు. ఆ పార్టీకి ఓ విధానం అంటూ లేదని ఎద్దేవా చేశారు.
రోజా తననైనా తిట్టగలదని జగన్ గ్రహిస్తే మంచిది
అవినీతిలో జగన్ పాత్ర ఉన్నందువల్లే తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కేంద్రంలో...రాష్ట్రంలో ఉన్న అవినీతిపై పోరాడతానంటే రోజా బాధ పడుతున్నట్లు కనిపిస్తోందని తెలుగు మహిళ అధ్యక్షురాలు శోభా హైమావతి వ్యాఖ్యానించారు. సినిమాల్లో వేషాలు మార్చినట్లుగా ఆమె మాటలు మారుస్తు...'రోజా టిడిపిలో ఉండగా వైఎస్ రాజశేఖరరెడ్డిని తిట్టారు. అటువైపు వెళ్ళగానే చంద్రబాబును తిడుతున్నారు.ఆమె రేపు తననైనా ఇదే మాదిరిగా తిట్టగలదని జగన్ గ్రహిస్తే మంచిది' అని శోభ అన్నారు.
ఫీజు రీయింబర్స్‌మెంట్ కి పైసా కూడా విడుదల కాలేదన్న జగన్
అభివృద్ధి, సంక్షేమ పథకాలు సక్రమంగా అమలు చేయని రాష్ట్ర ప్రభుత్వానికి పాలించే అర్హత లేదని యువనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మైనార్టీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ కింద రావల్సి ఉందన్నారు. అయితే ప్రభుత్వం మాత్రం పైసా కూడా విడుదల చేయలేదని మండిపడ్డారు. కమిషన్లు వేయటం తప్పా ప్రభుత్వాలు ముస్లింలకు చేసింది ఏమీ లేదని జగన్ అన్నారు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)