పెళ్ళి కాకుండా కాంగ్రెస్, ప్రజా రాజ్యం పార్టీలు ఎప్పటి నుంచో సహజీవనం చేస్తున్నాయని, ఇప్పుడు అధికారికంగా తాళి కట్టుకొందామని అనుకొంటున్నాయని బుచ్చయ్య చౌదరి వ్యాఖ్యానించారు.
ఇతర పార్టీలోని పరిణామాలతో తమకు సంబంధం లేదని, తమ పని తాము చేసుకొంటూ పోతామని ఆయన చెప్పారు. ఒకరి కోసం అవిశ్వాసాలు పెట్టాల్సిన అవసరం తమకు లేదని...తమ వ్యూహం ప్రకారం తాము ముందుకు వెళ్తామన్నారు. రాష్ట్రంలోని అనిశ్చితితో మొత్తం రాష్ట్రం నష్టపోతోందని, శ్రీకృష్ణ కమిటీ నివేదికలోని అంశాలను పరిగణనలోకి తీసుకొని కేంద్రం వెంటనే ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని ఆయన కోరారు.