కాంగ్రెస్ పార్టీ మునుగుతూ.. చిరంజీవినీ ముంచేస్తుందన్నారు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ. కాంగ్రెస్‌పార్టీ మునిగిపోయే పడవ అని, చిరంజీవి ఆ పడవను ఎక్కితే బరువెక్కువవుతుందే కానీ.. తేలదని ఎద్దేవా చేశారు. . కేంద్రంలో, రాష్ట్రంలో కాయకల్ప చికిత్స చేసి కాంగ్రెస్‌ను నిలబెట్టుకోవాలని చూస్తున్నారని, వాస్తవానికి కాయకల్ప చికిత్స వల్ల రోగం పూర్తిగా నయం కాదని.. లోన కుళ్లి పోతుంటే పైన సుగంధ ద్రవ్యాలు చల్లితే ఉపయోగం ఉండదు' అని ఎద్దేవా చేశారు.