1, ఫిబ్రవరి 2011, మంగళవారం

రోజా తననైనా తిట్టగలదని జగన్ గ్రహిస్తే మంచిది

అవినీతిలో జగన్ పాత్ర ఉన్నందువల్లే తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కేంద్రంలో...రాష్ట్రంలో ఉన్న అవినీతిపై పోరాడతానంటే రోజా బాధ పడుతున్నట్లు కనిపిస్తోందని తెలుగు మహిళ అధ్యక్షురాలు శోభా హైమావతి వ్యాఖ్యానించారు. సినిమాల్లో వేషాలు మార్చినట్లుగా ఆమె మాటలు మారుస్తు...'రోజా టిడిపిలో ఉండగా వైఎస్ రాజశేఖరరెడ్డిని తిట్టారు. అటువైపు వెళ్ళగానే చంద్రబాబును తిడుతున్నారు.ఆమె రేపు తననైనా ఇదే మాదిరిగా తిట్టగలదని జగన్ గ్రహిస్తే మంచిది' అని శోభ అన్నారు.