టిఆర్ఎస్ అధ్యక్షుడు కెసిఆర్ వాడుతున్న పదజాలం చూస్తే ఆయనను పిచ్చి కుక్క కరిచినట్లుందని తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి గోరంట్ల బుచ్చయ్య చౌదరి వ్యాఖ్యానించారు. 'కెసిఆర్ తాతలు బొబ్బిలిలో ఏం పేడ తిన్నారు? కెసిఆర్ గతంలో టిడిపిలో ఉన్నప్పుడు రాజమండ్రి, తిరుపతి, విశాఖపట్నం వచ్చినప్పుడు ఆరంగారంగా పులుసుకూరలు, చేపల పులుసులు, బిర్యానీలు తిన్నారు.
అవన్నీ పేడేనా? కెసిఆర్ తాతలు వలస వచ్చినట్లే అనేక మంది చదువులు, ఉద్యోగాలు, ఉపాధి కోసం హైదరాబాద్‌కు వలస వచ్చారు. ఇక్కడకు సీమాం«ద్రులే రాలేదు. తెలంగాణ ప్రజలు సహృదయులు...నిస్వార్ధపరులని, వారి మనసులను కెసిఆర్ విషపూరితం చేస్తున్నారని ఆయన ఆరోపించారు.