ఇద్దరు ప్రముఖులు రూ.100 కోట్ల కోసం తనను బ్లాక్‌మెయిల్ చేసి కుట్ర పన్ని ఈ కేసులో ఇరికించి జైలుకు పంపారని ధ్యానపీఠాధిపతి నిత్యానంద స్వామి ఆరోపించారు. సిఓడి పోలీసులకు ఈ వివరాలు చెప్పినా వారు విని ఊరుకున్నారని ... తనకు ప్రాణభయం ఉన్నందున ప్రస్తుతానికి వీరి పేర్లను వెల్లడించలే కపోతున్నట్లు చెప్పారు.
ప్రపంచవ్యాప్తంగా తనకు కోటి మంది భక్తులు ఉన్నారని తనపై సినీనటి రంజిత రాసలీలల వ్యవహారం పూర్తిగా కట్టుకథ .. నీచమైన ఆరోపణలు వచ్చినప్పటికీ భక్తులు పట్టించుకోవడంలేదని నేటికీ లక్షల సంఖ్యలో తమ ఆశ్రమానికి వస్తూనే ఉన్నారని... ఇప్పటికీ ఇంటర్నెట్‌లో తానే అందరికన్నా పాపులర్ గురువునని నిత్యానంద చెప్పుకున్నారు.