ఇటీవల ఆంధ్ర ప్రదేశ్ దినోత్సవం నేపద్యంలో గీతారెడ్డి నివాసంపై దాడి చేసిన వారిపట్ల ఎస్సీ, ఎస్టీ అత్యాచార, దాడుల నిరోధక చట్టం కింద కేసులు ఎందుకు పెట్టకూడదో హరీష్‌రావు సమాధానం చెప్పాలని మాలమహానాడు అధ్యక్షుడు కారెం శివాజి డిమాండ్ చేశారు.
సనివారం అయన మీడియా తో మాట్లాడుతూ... తెలంగాణ ఏర్పడితే దళితులను ముఖ్యమంత్రి చేస్తామని ప్రకటించిన టీఆర్ఎస్ దళిత మంత్రి నివాసంపై ఎవరి అనుమతితో దాడికి దిగి వస్తువులు, ఫర్నిచర్ దంసం చేసారో చెప్పాలని డిమాండు చేస్సారు..
తమ పార్టీ నేతలు చేసిన దాడిని ఖండిస్తూ టీఆర్ఎస్ అధ్యక్షుడు కె. చంద్రశేఖర్‌రావు వెంటనే మంత్రి గీతారెడ్డికి క్షమాపణ చెప్పాలని కారెం శివాజి డిమాండ్ చేశారు