అమెరికా అధ్యక్షుడు ఒబామా భారత్‌లో మూడురోజుల పర్యటన నిమిత్తం భార్య మిషెల్లితోపాటు శనివారం మధ్యాహ్నం ముంబాయికి చేరుకున్నారు. మహారాష్ట్ర సీఎం అశోక్‌చవాన్, మంత్రి సల్మాన్ ఖుర్షిద్ తదితరులు ఒబామా బృందానికి స్వాగతం పలికారు. ఒబామా వెంట 200 మంది సీఈవోలతో సహా 3000 మంది ప్రతినిధులు ఉన్నారు
ఒబామా భారత్ పర్యటన నేపథ్యంలో ముంబై నగరం అంతటా పోలీసుల పహారతో నిండిపోయింది. ఎటు చూసినా పోలీసుల మయమే. ఒక విధంగా కర్ఫ్యూ వాతావరణాన్ని తలపిస్తోంది.
'వైట్‌హౌస్' పరివారం తరలి రావటంతో వారి బస కోసం తాజ్ హోటల్‌లోని దాదాపు 800 రూములను బుక్ చేశారు.