నిజంగా తెలంగాణా ఏర్పాటు కోసమే పుట్టామని చెప్పుకునీ టిఆర్ఎస్ పార్టీకి అసలు తెలంగాణ రాష్ట్రం రావాలని లేదని, అందుకే అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం మాని టిడిపిపై పడుతోందని తెలుగుదేశం పార్టీకి చెందిన సీమాంధ్ర నేత ముద్దు కృష్ణమ నాయుడు వ్యాఖ్యానించారు..
తెలంగాణ వచ్చేస్తే ఇక తమకు పని ఉండదని వారి భయం. అందుకే కాంగ్రెస్‌పై ఒత్తిడి తేవడం లేదు. దాని బదులు ఆ పార్టీతోనే లోపాయికారి ఒప్పందం కుదుర్చుకొని తెలంగాణలో టిడిపిని దెబ్బ తీయాలని ప్రయత్నిస్తోంది అన్నది అక్షర సత్యమని ప్రజలు గ్రహిస్తున్నారని అన్నారాయన.
తెలంగాణ ఇచ్చేది...తెచ్చేది తామేనని తెలంగాణ కాంగ్రెస్ నేతలు.. టిఆర్ఎస్‌ను అడ్డుపెట్టుకొని నాటకం తుంటీ... రాకుండా తామే ఆపామని సీమాంధ్రలోని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారని, ఇందులో ఏది నిజమని ఆయన ప్రశ్నించారు..కాంగ్రెస్ పార్టీ ఇంతవరకూ తన వైఖరిని వెల్లడించలేదని... టిఆర్ఎస్ వ్యవహారం చూస్తుంటే
కాంగ్రెస్ పార్టీతో మ్యాచ్ ఫిక్సింగ్ బయటపడింది ' అని వ్యాఖ్యానించారు ముద్దు కృష్ణమ.