టిఆర్ఎస్ పార్టీలో నుంచి నిజమైన తెలంగాణవాదులంతా బయటకు పోయి బ్లాక్‌మెయిలర్లు మిగిలారని తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకరరావు వ్యాఖ్యానించారు.
ఇప్పుడు కెసిఆర్ కోరుకునే బ్లాక్‌మెయిలర్లు, పదవులను ఆశించేవారు..రాజకీయ లబ్ధిని కోరుకునే వారే ఇప్పుడు తెరాసలో ఉన్నారని విమర్శించారు అయన... తెలంగాణా వస్తే స్నాకు ఇబ్బందులు తప్పవని భావిచీ... తెలంగాణా ఏర్పాటు చేతికి అందివచ్చిన ప్రతి దశలోనూ కెసిఆర్ ప్రవర్తన వల్లే వెనక్కు దని విమర్శించారు .
కేవలం తన కుటుంబ వ్యాపారాలను పెంచుకోవడానికి తెలంగాణ ఒక సాధనంగా ఆంధ్రావారిని భయపెట్టి బ్లాక్‌మెయిల్ చేసి వారితో బలవంతంగా వ్యాపార భాగస్వామ్యాలను తీసుకోనేందుకే వాడుకున్నారని... ఇది కాకపోతే తెలంగాణా జిల్లాలలో ట్రాక్టర్ల డీలర్ షిప్పులు, ఇతర వ్యాపారాలు ఆయన కుటుంబానికి ఎక్కడ నుంచి వచ్చాయి' అని ఎర్రబెల్లి ప్రశ్నించారు.
కెసిఆర్‌కు దమ్ముంటే పార్లమెంటులో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుపై కాంగ్రెస్‌తో బిల్లు పెట్టించాలి. ఏ ప్రాంతమనే దానితో నిమిత్తం లేకుండా లోక్‌సభలో టిడిపికి ఉన్న మొత్తం ఆరుగురు ఎంపీలు దానికి అనుకూలంగా ఓటు వేసేందుకు సిద్దంగా ఉన్నారని చెప్తున్నా.. బిల్లుకి మద్దతు ఇవ్వాల్సిన కాంగ్రెస్ పారి పట్టించుకోని కెసిఆర్ తమ పార్టీ నేతలని ఉసిగొలిపి... చంద్రబాబు పర్యటనలు అడ్డు కొంటు న్నారని విమర్శించారు ఎ ర్రబిల్లి ,