30, జనవరి 2011, ఆదివారం

దాసరి పుండు మీద 'మిరపకారం' చల్లాడు

అసలే 'పరమవీరచక్ర'కు ఇంటర్ నేషనల్ పరమ చెత్త అవార్డులు ఎన్ని వస్తాయో అంటూ దాసరి నారాయణ రావు టెన్షన్ పడుతుంటే బుడ్డోడు అల్లు శిరీష్ పుండు పైన కారం చల్లినట్టు మాట్లాడుతున్నాడు.

నిర్మాత సి.కళ్యాణ్ పరమ కలెక్షన్ల గూర్చి పట్టించుకోవడమే మానేసి పోలీసుల చుట్టూ తిరుగుతుంటే తన సినిమా మీద మమకారం చావని దాసరి అడపాదడపా టీవీల్లో కనపడుతూ ఎప్పుడో పడుకున్న దాన్ని లేపే విఫలయత్నాలు చేస్తున్నాడు. పరమవీరచక్రకు సరైన సినిమా హాళ్ళు ఇవ్వడంలో అల్లు అరవింద్ వర్గం గీతా ఫిలిమ్స్ ద్వారా రాజకీయం చేసిందంటూ దాసరి వర్గం చిర్రుబుర్రులాడితే, దీనికి సంబంధించి అల్లు శిరీష్ పిల్ల బుద్ధులను మరోసారి ట్విట్టర్లో ప్రదర్శించేసాడు.

'మన గీతా ఫిలిమ్స్ మీద విడుదలైన ప్రతి సినిమాకు మంచి థియేటర్స్ దొరుకుతాయి. మంచి కలెక్షన్లు రాబడతాయి. సినిమా ఫ్లాపైనా కలెక్షన్లు హిట్టుకంటే ఎక్కువగా ఉంటాయి. ఉదాహరణ మిరపకాయ' అంటూ మిరపకారం చల్లి వదిలేసాడు. అసలే అల్లు అన్నా గీతా అన్నా కుల్లుకుంటున్న దాసరి మరి ఈ వాగుడుకాయని కూడా పట్టించుకుంటాడా?

తుపాకి నుంచి సేకరణ