పవన్ కళ్యాణ్ తాజా చిత్రం తీన్ మార్ చిత్రం ఈ నెల 14 వ తేదిన విడుదల చేయనున్నట్లు నిర్మాత గణేష్ బాబు ప్రకటించారు.
ఈ సందర్బంగా నిర్మాత మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతూ...పవన్‌కళ్యాణ్ ఈ చిత్రంలో రెండు విభిన్న పాత్రల్లో నటించారు. అర్జున్ పాల్వాయ్, మైఖేల్ వేలాయుధం పాత్రల్లో ఆయన అద్భుతం. పవన్‌కళ్యాణ్ నుంచి ఆయన అభిమానులు, ప్రేక్షకులు ఏం కోరుకుంటారో అదే వంద శాతం స్క్రీన్‌మీద ఉంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన కెరీర్‌లోనే ఇది బెస్ట్ మూవీగా నిలుస్తుం దన్నారు.