డీఎండీకే అధ్యక్షుడు విజయకాంత్ పార్టీకి క్వార్టర్ బాటిల్ గుర్తు ఇచ్చి ఉండాలని జనతా పార్టీ అధ్యక్షుడు సుబ్రమణ్యస్వామి ఎద్దేవా చేశారు. తాగిన మైకంలో విజయకాంత్ తన అభ్యర్థిని ప్రచారసభలో కొట్టడం దారుణమన్నారు. జీ స్పెక్ట్రం కుంభకోణంలో రాజా ఒక్కరే నిందితుడు కాదని ఇందు లో దయాలు అమ్మాళ్, రాజాత్తి అమ్మాల్, కనిమొళి, చిదంబరం కూడా ఉన్నారని, చిదంబరం దేశంలోనే పెద్ద కోటీశ్వరుడు ... ఇతర దేశాల్లోని బ్యాంకుల్లో రూ. 50 వేల కోట్లను దాచి ఉంచారని ఆరోపించారు. మాఫి యా డాన్ దావూద్ ఇబ్రహీం అనుచరుడు పాల్వాకు లెసైన్స్ ఇవ్వకూడదని హోంమంత్రి చిదంబరం అప్పటి టెలి కాం శాఖ మంత్రి రాజాకు ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు.
కాంగ్రెస్ పార్టీ ఇక రోజు లు లెక్క పెట్టుకోవాల్సిందేనని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ఆఖరి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ అని, సోనియాగాంధీ ఇక ఇటలీకి వెళ్లక తప్పని పరిస్థితి వస్తుం దని అన్నారు. ఎన్నికలు జరగనున్న ఐదు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ పరాజయం పాలవడం తథ్యమన్నారు.