భారత్ మ్యాచ్ గెలిచిన తర్వాత స్వాతంత్రాన్ని ఇప్పుడే సాధించుకోన్నామా అన్నంత ఆనందం ప్రతి ఒక్కరిలో కలిగిందని అమితాబ్ ట్విట్టర్‌లో రాసుకున్నారు. సాధారణంగా భారత్ మ్యాచ్ జరిగేటప్పుడు తాను అసలు చూడనని, అయినా 33 పరుగులకు 2 వికెట్లు పడిపోయినా.. చివరి మ్యాచ్ విన్నింగ్ షాట్ లో కెప్టెన్ ధోని సిక్స్ కొట్టేవరకూ టెలివిజన్‌కు అత్తుకుపోయి కూర్చున్నానని ఆయన తెలిపారు. భారత్ గెలిచినా ఆనందంలో.. నేనే అది గెలిచానన్న ఫీలింగ్ కలిగి చిన్నపిల్లలా మాదిరిగా అభిషేక్, ఐశ్వర్యల తో కలిసి కారు టాప్‌పై కూర్చుని త్రివర్ణ ప్రతాకాన్ని ఊపడం చెప్పనలవి కాని గొప్ప అనుభూతి అని అన్నారు. అల్లాగే సినీ ఇండస్ట్రీ లో సాద్యం కాని రజని, గజనీ, ధోనీల అపూర్వ కలయిక క్రికెట్ తో సాధ్యమైంది అని తెగ ఆనంద పడిపోయారు అమితాబ్...