రానా, అభిషేక్ బచ్చన్, బిపాసా బసు, దీపికా పదుకునె నటిస్తున్న "దమ్మరో దమ్" చిత్రంపై హైకోర్టుకెళ్లనున్నట్లు గోవా పర్యాటక మంత్రి నీలకంఠ హలార్కర్ తెలిపారు. చిత్ర దర్శకుడు రోహన్ సిప్పీ గోవా ప్రతిష్టను దిగజార్చే విధంగా చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని మంత్రి ధ్వజమెత్తారు.
ఈ చిత్రాన్ని బ్యాన్ చేయాలని అసెంబ్లీలో సైతం లేవనెత్తారు గోవా మాజీమంత్రి మిక్కీ . ఎట్టి పరిస్థితుల్లో ప్రదర్శించనీయకుండా అడ్డుకోవాలని ప్రజలకి సూచిన్చారాయన. భారతదేశంలోనే ప్రముఖమైన టూరిస్ట్ స్పాట్‌గా ఉన్న గోవాను చిత్రంలో దారుణంగా చూపారనీ, ఈ చిత్రం వల్ల పర్యాటకం కేంద్రంగా భాసిల్లుతున్న గోవాకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.