అసలే వేసవి కాలం.. అందులో భ గ్గున మండే ఎండలు.. గుక్కెడు నీళ్లు తాగి దూప తీర్చుకోవడం కంటే చల్లని బీరు తాగి సేద తీరడమే మేలంటున్నా రు 'బీర్' ప్రియులు. గొంతు తడిపేందుకు గుక్కెడు నీళ్లు దొరకకున్నప్పటికీ చల్లని బీర్లు మాత్రం అందుబాటులో ఉంటున్నాయి. పట్టణాలు, పల్లెలు అనే తేడా లేకుండా అం తటా మద్యం దుకాణాలు వెలిశాయి. ఇక ప్రతి పల్లెలోనూ, పల్లెల్లోనీ వాడల్లోనూ బెల్ట్‌షాపులు వెలిశాయి. పల్లెల్లో చెంబెడు నీళ్ల కోసం మైళ్ల దూరం నడవాల్సి ఉండగా బీర్లు మాత్రం ప్రతి పల్లెలోని ప్రతి గల్లీలో దొరుకుతున్నాయి.
మంచినీళ్లు దొరకకున్నప్పటికీ బీర్లు మాత్రం పొంగిపొర్లుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి ఎద్దడి నివారించేందుకు ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు చర్యలు తీసుకోనప్పటికీ అబ్కారీ అధికారుల పుణ్య మా..! అని పల్లె పల్లెల్లో వెలసిన బెల్ట్‌షాపుల మూలంగా చల్లని బీర్లు లభిస్తున్నాయి.
పల్లె ప్రజానీకానికి తాగునీరందించేందుకు పెద్దగా శ్రద్ధాసక్తులు కనబరచని ప్రభుత్వం ప్రతి ఏటా మద్యం విక్రయాలపైనే దృష్టిని కేంద్రీకరించింది. ఫలితంగా ఇటు మద్యం దుకాణాలతోపాటు అటు దాబాలు, బెల్ట్‌షాపుల్లో చల్లనీ బీరు, విస్కీలు పుష్కలం గా లభిస్తున్నాయి.
తాగేందుకు బిందెడు నీళ్లు తెచ్చేందుకు నిరాకరించే మందుబాబులు చల్లని బీర్లు తెచ్చుకుని తాగడంపైనే మక్కువ కనబరుస్తున్నారు.