కడప ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయం సాధించడం ఖాయమని ఆ పార్టీ నాయకురాలు, ఎమ్మెల్సీ నన్నపనేని రాజకుమారి పేర్కొన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీ మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడ్డాయన్న ఆరోపణలపై తీవ్రస్థాయిలో స్పందించిన ఆమె అందుకు రుజు వులు చూపించగలరా? అని ప్రశ్నించారు. తెలుగుదేశం పార్టీ ఏ పరిస్థితుల్లోనూ కాంగ్రెస్‌తో కుమ్మక్కయ్యే దుస్థితికి దిగజారదని స్పష్టం చేశారు. కడప ఉప ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేసే అభ్యర్థులే లేరు కదా అన్న ప్రశ్నకు మైసూరారెడ్డి ఉన్నారు కదా...ఎవరు అభ్యర్థులుగా ఉన్నా గెలవడమే తమ లక్ష్యమన్నారు.