బుజ్జిగాడి బర్త్‌డే నుండి.. బాలుగాడు ప్రైజ్ అందుకునే ఫంక్షన్ వరకు ఫోటోగ్రాఫర్, ఫ్లాష్ లైట్ల మెరుపుల హడావిడి అంతా ఇంతా కాదు. నిత్య జీవితంలో ఆనందాల జ్ఞాపకాలను అనునిత్యం మనకు గుర్తు చేసేవి ఫోటోలే...పెళ్లిళ్లు, పేరంటాలు, పుట్ట్టినరోజులు, పండగలు ఇలా ఏ కార్యక్రమం చేసినా... ఫోటోల వెల్లువ నేడు కామన్ అయిపోయింది.సాంకేతికాభివృధ్ధి ఫోటోగ్రఫీలోనూ చోటు చేసుకుని ఒకపðడు రోజుల తరబడి ఫోటో కోసం వేచి చూసే స్ధితి నుంచి క్షణాలలో కావాల్సిన సైజులో ఫోటో తీసుకునే డిజిటల్ ఫోటోగ్రఫీ అందుబాటులోకి వచ్చింది.
ఉదయం లేచింది మెదలు... రాత్రి నిద్ర పోయే వరకు ప్రతి ఒక్కరూ ఏదో ఓ తరహాలో ఫోటోలపై ఆధారపడుతు న్నారనే చెప్పక తప్పదు. ఇపðడు సెల్ ఫోన్లలో కూడా కెమెరాలు ఇమిడి పోవటంతో దాదాపు ప్రతి ఇంట ఫోటోగ్రాఫర్ పుట్టుకొచ్చాడనటంలో సందేహం లేదు. మనిషి పుట్టిన దగ్గర నుంచి చనిపోయేంత వరకు ఫోటో మీదే జీవితం ఆధారపడి ఉందనటంలో అతిశయోక్తి లేదు. హృదయానికి హత్త్తుకునేలా చిత్రీకరించిన ఫోటోలు మనిషిపై ఎంతో ప్రభావం చూపిస్తాయన్నది వాస్తవం. చిరాకు గానో... మనసుకి కష్టం కలిగినపðడో పాత ఫోటోలు చూసుకుంటూ జ్ఞాపకాల దొంతరులను నెమరేసుకుంటే కొంత మేరైనా ఉపశమనం లభిస్తుంది. విశ్వవ్యాప్తంగా ఫోటోగ్రఫీ ప్రాధాన్యతని గుర్త్తించి గత 173 సంవత్సరాలుగా ప్రతి ఏటా ఆగష్టు 19న ఃప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవంః గా నిర్వహిస్తున్నారు.
ఇక ఫోటోగ్రఫీ అభివృద్ధితీరు తెన్నులు ఓ సారి పరిశీలిస్త్తే...
నేడు క్షణాల్లో కన్నువిందుచేసే ఫోటోల వెనుక ఐదు శతాబ్దాల చరిత్ర దాగి ఉంది.
1550 డే-సబ్టిలైటెట్ అనే భైతిక శాస్త్రవేత్త కాంతిని తగుఋజుమార్గంలో కటకాల మధ్య గుండా ప్రసరింపచేస్తే ప్రతిబింబాన్ని స్కేచ్ వేసి ఫోటోగ్రఫీకి ప్రాణ ప్రతిష్ట చేసాడు.
1568 డానియల్లో బార్బర్ కాంతిమార్గాన్ని నిర్ధేశిించేలా కటకాల మధ్య దూరం నెలకొల్పి.. ప్రతిబింబాల చిత్తరువులను లిఖించవచ్చని పేర్కొన్నాడు.
1646 కిర్చల్ అనే శాస్త్రవేత్త ఎన్నో ప్రయోగాల చేస్తూ కెమెరా రూపొందించేందుకు ప్రయత్నించాడు.
1657 కస్పర్ స్కాట్ లనే శాస్త్రజ్ఞుడు కిర్చల్ చూపిన బాటలోనే పయనిస్త్తూ అనేక పరిశోధనలు చేసారు.
1685 వర్బర్గ్‌కి చెందిన జాన్ ఝహ్నా రిఫ్లక్టర్ కెమేరాకు డిజైన్ చేసాడు.
1725 ఆల్డ్ర్‌ఫర్ యూనివర్శిటీలో పరిశోధకుడిగా పనిచేస్త్తున్న ఃజాన్ హెన్రీ స్కాజ్‌ః ఫోటో కెమిస్ట్రీ పేరుతో కాగితంపై వివిధ రసాయనాలను లేపనంగా పూసి చిత్రీకరించేందుకు ప్రయోగాలు చేసాడు.
1769 జార్జ్ బ్రాండర్ ఏకంగా ఃటేబుల్‌ః ఆకారంలో ఓ పెద్ద కెమేరాకు రూపకల్పన చేసాడు.
1822 ఃజాన్ హెన్రీః ఫోటో కెమిస్ట్రీని ఆధారంగా చేసుకుని కార్ల్ విలియమ్స్, జాన్‌సన్‌బ్రేర్, నైస్‌ఫోర్స్ నిప్సేల బృందం ప్రయాగాలను ప్రారంభించింది.
1826 ఫ్రెంచ్ పరిశోధకుడైన నైస్‌ఫోర్స్ నిప్సే పెట్రోలియం ఉత్పత్తులలో ఒకటయిన బిటు మేన్, జుడియాల కలయికతో కూడిన రసాయనాన్ని మెరుగు పెట్ట్టిన ఓ పళ్లెంపై పూసి తీసి ప్రయోగాలు చేస్తూ...1829లో మరో శాస్త్రవేత్తతో కల్సి చేసిన ప్రయోగాలు ఫలించి... ఓ రాగి ప్లేటుపై వెండి పూత పూసి... సున్నితమైన కాంతిని.. దానిపై ప్రసరింప చేసినపðడు కెమేరా ఎదురుగా ఉన్న వస్తువు ప్రతిబింబం ప్లేటుపై ముద్రించబడటాన్ని ఆవిష్కరించి.. తాను తీసిన ఫోటోని ప్రపంచానికి విడుదల చేసాడు. దీనినే తొలి ఫోటోగా... నైస్‌ఫోర్స్ నిప్సేని ఫోటోగ్రఫీ˜ీకి ఆద్యుడిగా చెపðకుంటారు...
1835 ఇంగ్ల్లాండ్‌కు చెందిన విలీయం హెన్రీ ఫాక్స టల్బర్డ్ తొలిసారిగా పేపర్‌పై నెగిటివ్ తయారు చేసారు.
1837 నిప్సే మనుష్యులని ఫోటో తీసేందుకు తాను చేస్తున్న ప్రయోగాలు ఫలిస్తున్నట్లు ప్రకటించాడు. కాగా లూయీస్ జాక్వాస్ మాండే డాగ్యూరీ తొలిసారిగా బైట ప్రపంచాన్ని... మనుష్యులని తన కెమెరాతో ఓ వీధిని తన కెమెరాలో బంధించి ఫోటోగ్రఫీ ప్రాముఖ్యతని ప్రపంచానికి చాటి చెప్పాడు. చీకటిగదిలో తను తీసిన ఫోటో ప్లేట్లను..సిల్వర్ నైట్రిక ఆసిడ్‌ని డిస్టలరీ నీటిలో కలిపి తయారు చేసిన రసాయనాన్ని పూత పూసిన కాగితంపైకి పాజిటవ్‌గా మార్చగలిగానని.. దీనిని ధయోసల్ఫేట్‌లో ముంచి ఉంచితే చిత్రానికి స్ధిరత్వం వచ్చినట్లు గుర్తించానని ఇందుకు ఓ బాక్సలో 117 డిగ్రీల వాలున ఉంచిక కటకాలపై నుంచి సన్నని కాంతి పుంజాన్ని పంపానని విశ్లేషించాడు.. దానికి ఃడగ్యూరీ టైపుఃగా నేటికీ పిలుస్తారు.,
1839 జనవరి 9న ఫ్రెంచ్ అకాడమీ ఆఫ్ సైన్సెస్‌లో ఃడగ్యూరీః తన ప్రయోగాల సారాంశాలను.. వచ్చిన ఫలితాలను ప్రకటించగమే కాకుండా సింగిల్ లెన్స్‌తో కూడిన కెమేరా తయారీ చేసేందుకు సిద్దమవుతున్నట్లు ప్రకటించారు. కొద్ది నెలల అనంతరం అదే ఏడాది ఆగష్టు 19న ఫ్రెంచ్ ప్రభుత్వం ఃడగ్యూరీః ప్రయోగాన్ని అధికారికంగా గుర్తించింది. అప్పటి నుంచే ఫోటోగ్రఫీలో ఆగష్టు 19కి ఎనలేని ప్రాధాన్యం ఇవ్వటం ప్రారంభమైందనే చెప్పక తప్పదు. డిశంబర్‌లో ఇంగ్లాండ్‌కు చెందిన సర్ జాన్ హ్రెస్కల్ నెగిటివ్, పాజిటివ్ తయారీలో సిల్వర్ కార్బనేట్ ఉపయోగాలను వెల్లడించాడు.
1840 వియత్నాంలోని జోసఫ్ పట్జ్వేల్, పీటర్ వోగ్లాండర్‌లు రెండు లెన్సుల కెమేరాకు రూపకల్పన చేసారు.
1841 ఫిబ్రవరిలో టాల్బెల్ అనే శాస్త్రవేత్త తాను చేసిన ఫోటో ప్రయోగాల ఫలితాలను ఃటాల్బెల్ టైప్‌ఃగా పేర్కొంటు దానిపై పేటెంట్ హక్కుల్ని కూడా సొంతం చేసుకున్నాడు. టాల్బెట్ చూపిన దారిలో చేసిన ప్రయోగాలు బ్లాక Ê వైట్ ఫోటోగ్రఫీని కొత్త పుంతలు తొక్కించాయి.
1847 అబెల్ నైప్స్ అనే శాస్త్రవేత్త గాజుపై జల్లిక ఆసిడ్, హైపోలతో చేసిన ప్రయోగాలను విశ్లేషించినా.. అది కాలాహరణంగా పరిగణించారంతా..
మరోవైపు ఃటాల్బెల్ టైప్‌ఃగా ఉన్న పద్దతిపై మరిన్ని ప్రయోగాలు చేసిన ఇంగ్లాండ్‌కి చెందిన ఫెర్రిక స్కాట్ ఆర్డర్ ఃకొలోడిన్‌ః పద్దతి రూపొందించాడు. ఇందులో ఆయన ఃటాల్బెల్ టైప్‌ఃలో వినియోగిస్తున్న రసాయనాలకు తోడుగా ఫెర్రిక సలఫర్‌ని జతచేసి చిత్రీకరింప బడిన గ్లాస్ ప్లేట్లని 3 నుండి 25 సెకన్లపాటు నెగిటివ్‌ని తీసుకు రాగలిగినట్లు తెలిపారు. అంతే కాక లెదర్ కాగితంపై పాజిటివ్‌ని కూడా రూపొందించవచ్చని పేర్కొన్నారు.
1850 బ్లాంక్వర్ట్-ఎవర్డ్ ఃసిల్వర్ నైట్రేట్‌ఃని పూసిన కాగితంపై ఫోటో పాజిటివ్ రూపొందించడం 19వ శతాబ్ధంలో అత్యంత విజయంగా చెప్తారు.
1878 ఛార్లెస్ బెనెట్ అనే భౌతిక శాస్త్రవేత్త సిల్వర్ నైట్రేట్, కాడ్మియం బ్రోమైడ్‌ల కలయికతో కూడిన పేపర్‌ని రూపొందించి సెకనులో 22% సమయంలో కాంతిని గ్లాస్ ప్లేట్లపై నుండి ప్రసరింపచేసి ఃపాజిటివ్‌ః తీసుకువచ్చాడు.
1880 గ్లాస్ ప్లేట్ల స్ధానంలోకి డ్రై ప్లేట్లను అందించే ఏర్పాటుకు ప్రయోగాలు ప్రారంభమయ్యాయి.
1888లో న్యూయార్క్‌లోని జాన్ వెస్లీ హెట్ ఃసెల్యులాయిడ్‌ః మాన్యుఫ్యాక్చరింగ్ కంపెనీని ప్రారంభించి ప్రయోగాలకు శ్రీకారంచుట్టగా యుఎస్‌లో బ్రిటీష్ ఫోటోగ్రాఫర్ జాన్ కార్బెట్ ఫిల్థోపియా కేంద్రంగా డైప్లేట్ల తయారీ కేంద్రాన్ని ప్రారంభించాడు.
1888 ఏడాది ద్వితీయార్ధంలో జాన్ కార్బెట్ రూపొందించిన ఫిక్సిబుల్ నెగిటివ్ ఫిల్మ్ విజయవంతం అయ్యింది.
1888 న్యూయార్క్‌లోని పయనీర్ జార్జ్ ఈస్ట్‌మన్ కంపెనీ ఃకొడకః కెమేరాకి రూపకల్పన జరిగింది.
1889 సెప్టెంబర్‌లో న్యూయార్క్‌లోని భన్బిల్ గాడ్విన్ ట్రాన్పిరెంట్ రోల్ ఫిల్మ్‌ని రూపొందించి పేటెంట్ హక్కులు కూడా పొందటంతో ఈస్ట్‌మన్ కంపెనీ ఆయన్ని ఆహ్వానించి... రోల్ ఫిల్మ్‌ల తయారీపై ప్రయోగాలకు ఆసరాగా నిలచింది.
1902 జాన్ కార్బెట్ ప్రయోగాలు విజయవంతం కావటంతో కోడక రోల్ కంపెనీ రోల్ ఫిల్మ్ విడుదల చేసింది.
నాటి నుండి వివిధ కంపెనీలు ఫోటోగ్రఫీ రంగంలో అనేక కెమేరాలు రూపొందించాయి. తొలినాళ్లలో ఫిల్ముసైజ్ ప్రింట్ సైజు ఒకే స్ధాయిలో ఉండగా... అనతి కాలంలో వాటికి ధీటుగా 2బి, 120, 35, 24, 16 ఎంఎంల కెమేరాలు రంగంలోకి రావటంతో రోల్ ఫిల్మ్ వాడకం పెరిగి ఫోటోగ్రఫీ విస్తరణకు దోహదం చేసింది. బ్లాక Ê వైట్ ఫోటోగ్రఫీ పూర్తిస్ధాయిలో సక్సస్ అయ్యి అందరికీ ఫోటోగ్రఫీ అందుబాటులోకి వస్తున్న క్రమంలో కలర్ ఫోటోగ్రఫీపై ౖ ప్రయోగాలు ప్రారంభమై కొత్త అధ్యయనానికి తెరలేపాయి
కోడక డిజిటల్ కెమేరాలను రంగంలోకి తీసుకు రాగలిగింది. సింగిల్ లెన్స్ రిఫ్లక్స (ఎస్‌ఎల్‌ఆర్) కెమేరాల తరహాలోనే డిజిటల్ సింగిల్ లెన్స్ రిఫ్లక్స (డిఎస్‌ఎల్ ఆర్) కెమేరాలను రూపొందించబడ్డాయి. అనతి కాలంలోనే రింగ్‌ఫైండర్ కెమేరా, ట్విన్‌లెన్స్ రిఫ్లక్స కెమేరా, సింగిల్ లెన్స్ రిఫ్లక్స కెమేరా, డిజిటల్ సింగిల్ లెన్స్ రిఫ్లక్స కెమేరా, బొమ్మకెమేరా, వ్యూ కెమేరా, మువీ కెమేరా, వీడియో కెమేరాలు అందుబాటులోకి వచ్చాయి.
జిరాక్స...
డిజిటల్ ఫోటోగ్రఫీపై జరుగుతున్న ప్రయోగాల దిశలో 1952లో అప్పటికే వినియోగంలో ఉన్న వీడియో ప్లేయర్లలో కదులుతున్న బొమ్మల ఫ్రేమింగ్‌ని స్ధిరపరచి... ఫోటోగా మార్చడానికి ప్రయత్నాలు జరిగాయి. ఈ క్రమంలోనే 1957లో రసూల్ క్రిష్ రూపొందించిన ఃడ్రమ్‌స్కానర్‌ః ఆదరణ పొందింది. ఇదే టెక్నాలజీ ఉపయోగించి జిరాక్స మిషన్ రూపకల్పన జరిగింది. 19వ శతాబ్ధం ఫోటోగ్రఫీని కొత్త పుంతలు తొక్కించిందనే చెప్పాలి. ఈరంగంలో విశ్వవ్యాప్తంగా వచ్చిన సాంకేతిక మార్పులతో మరింత వేగం పుంజుకుని పొలరాయిడ్ కెమేరాలు దూసుకు వచ్చాయి. అయితే ఇది కొన్ని రంగాలకు మాత్రమే పరిమితం కావటం... ఖర్చు కూడా ఎక్కువగా అవతుండటంతో పరిశోధనలు మిన్నంటి...తనదైన పంథాలో చివరకి నెగిటివ్ లేకుండా ఫోటో తీసే విధానం (డిజిటల్ ఫోటోగ్రఫీ) వచ్చింది.
కలర్ ఫోటోగ్రఫీ.....
బ్లాక అండ్ వైట్ ఫోటోగ్రఫీ అద్భుతంగా వెలుగొందుతున్న తరుణంలో 1861లో స్కాట్ లాండ్‌లో భౌతిక శాస్త్రం, గణిత శాస్త్రంలలో నిష్ణాతుడిగా పేరున్న జేమ్స్ కార్ల్ మార్క్స్ ఫోటోగ్రఫీపై మక్కువతో అనేక ప్రయోగాలు చేసి తొలిసారిగా రంగుల్లో ఫోటో తీసే విధానాన్ని రూపొందించి ప్రపంచాన్ని నివ్వెరపరిచాడు. కలర్ ఫోటోగ్రఫీకి అద్యుడిగా ఈయన్నే పేర్కొంటారు. ఇంద్ర ధనస్సు రంగుల్లోని ఎరుపు, ఆకుపచ్చ, నీలంలను (ఆర్‌జిబి) తన ప్రయోగాలకు వాడుకుంటునే ద్వితీయంగా సిఎంవైకెలను ఉపయోగించాడు. ప్రత్యేకంగా రూపొందించిన ప్రొజక్టర్ల సాయంతో తెల్లని కాంతిని ప్రసరింప చేసి నెగిటివ్ తయారీ చేయవచ్చని నిరూపించాడు. 1873లో ఫోటో అమల్షన్ తయారు దారుడైన హెర్మన్ వోగెల్ ఃకలర్ కెమిస్ట్రీః పేరుతో రంగుల ఫోటోలపై అధ్యయనం చేసి విజయం సాధించాడు. 1892లో జాన్‌జూలీ కలర్ టచ్ సింగిల్ నెగిటివ్‌ని రూపొందించి ఃస్క్రీన్ ప్లేట్‌ః ప్రోసెసర్‌ని విడుదల చేసాడు. ఇందులో ఆయన అంతవరకు బ్లాక Ê వైట్ ఫోటోగ్రఫీలో వాడుతున్న ఎన్‌లా ర్జర్లుకు కలర్ ఫిల్మింగ్ (ఆర్‌జిబి)ని జత చేసి.. కలర్ ఫోటో ప్రింటింగ్ విధానం తీసుకొచ్చాడు. 1907లో ఃటమ్రీ బ్రదర్స్‌ః ఈ స్క్రీన్ ప్లేట్ విధానాన్ని కాస్త మారుస్తూ... లెడ్‌తో కూడిన ఆటో క్రోవెూ ప్లేట్స్‌ని విడుదల చేసారు.ఈ క్రమంలోనే లూయిస్ డక్యూస్ డు హర్న్ వీటిపై మరిన్ని ప్రయోగాలు చేసి సింగిల్ ఎక్పోజర్ లేయర్ ఫిల్మ్‌ని రూపొందించారు. దీనిని అనతి కాలంలోనే అంత వరకు బ్లాక Ê వైట్‌లో వాడుతున్న రోల్ ఫిల్మ్ తరహాలో 120 ఎంఎం కలర్ ఫిల్మ్ రోల్స్‌ని రూపొందించి.. 1936 నాటికి 35 ఎంఎం కెమేరా యుగం ప్రారంభం కావటంతో ఆదిశలో కలర్ ఫిల్మ్‌రోల్స్ ఉత్పత్తి జరిగింది.
డిజిటల్ ఫోటోగ్రఫీ ...
1951లో జాన్ మిలీనియర్ అనే ఎలక్ట్ట్రానిక్స ఇంజనీర్ వీడియో టేప్ రికార్డర్ (విటిఆర్) నుండి సంగ్రహించిన చిత్రాలను తిరిగి మేగ్నిటిక టైప్ పైనే నిక్షిప్తం చేయవచ్చని ప్రయోగాత్మకంగా నిరూపించాడు. దీనికి తోడుగా 1956లో ఛార్లెస్ పి గిన్బెర్గ్ సైతం విటిఆర్ టెక్నాలజీని ఉపయోగిస్తూ... నిక్షిప్తమైన చిత్రాలను టెలివిజన్‌లో చూసేలా చేసిన ప్రక్రియ డిజిటల్ వైపు ఫోటోగ్రఫీని పరుగులు తీయించిందనే చెప్పాలి. 1960లో చంద్రమండలంలోకి నాసా ప్రయోగించిన రాకెట్ అక్కడ నుండి పంపిన సందేశాల ఆధారంగా కంప్యూటర్ సాయంతో ఫోటోలుగా మార్చడం జరిగిన పరిణామాలు డిజిటల్ ఫోటోగ్రఫీ మరింత వేగవంతమైంది. 1973లో యుఎస్‌ఏ, న్యూయార్క్‌లో ఎలక్ట్రానిక్స ఇంజనీర్‌గా పినచేస్త్తున్న బోక్లేన్ స్టీవెన్ జె సస్సన్ నేతృత్వంలో ఈస్ట్‌మన్ కోడక కంపెనీ ఛార్డ్ కపుల్డ్ డివైల్ (సిసిడి) సాయంతో ఫిల్మ్ లేకుండా ఫోటో తీసే పద్దతిని కనుగునేందుకు ఏర్పాట్లు జరిగాయి. ఈ బృందం 1975లో 8 పౌండ్ల బరువుతో ఉన్న ఓ కెమేరాని రూపొందించింది. అయితే ఇది కేవలం 0.01 పిక్సిల్ అయినా యావత్ ప్రపంచాన్ని సంభ్రమాశ్చర్యాలతో ముంచి మరిన్ని ప్రయోగాలకు ఉపయుక్తంగా మారింది. 1978లో తన డిజిటల్ కెమెరాపై పేటెంట్ హక్కులు పొందిన బోక్లేన్ స్టీవెన్ జెసస్సన్ డిజిటల్ విప్లవానికి నాంది పలికారనే చెప్పాలి. ఆపై కోడక కంపెనీ అనేక మంది శాస్త్రవేత్తలతో కూడి అనేక రకాల ప్రయోగాలు నిర్వహించి విజయవంతంగా డిజిటల్ కెమేరాతో తీసిన ఫోటోలు ఫ్లాపీలలో నిక్షిప్తం చేసేలా రూపొందించింది.
2010 నవంబర్ 17న అమెరికా అధ్యక్షుడు బరాక ఒబామా తన వైట్ హౌజ్‌లోని ఈస్ట్‌రూంలో నిర్వహించిన ఓ ప్రత్యేక కార్యక్రమంలో ఫోటోగ్రఫీలో డిజిటల్ విప్లవానికి నాంది పలికి కెమేరాని రూపొందించిన బోక్లేన్ స్టీవెన్ జె సస్సన్‌కు ఃనేషనల్ మెడల్ ఆఫ్ టెక్నాలజీ Ê ఇన్విటేషన్‌ః అవార్డునిచ్చి సత్కరించడం ఓ విశేషం.
డిజిటల్ అందుబాటులోకి వచ్చాక ఫోటో క్వాలిటీని పెంచేలా మెగాపిక్స పరిధి కూడా పెరిగింది. చిన్నపాటి కంప్యూటర్ చిప్స్‌లో ఫోటోలు నిక్షిప్తం చేసే విధానం... చివరికి సెల్ ఫోన్లలోనూ కెమేరాలు వచ్చి ఫోటోగ్రఫీ గతినే మార్చేసాయి..
ప్రపంచవ్యాప్తంగా ఉన్న కెమెరాలను తయారు చేస్తున్న కంపెనీలు: హస్సన్‌బ్లేడ్, మామియా, మినోల్టా, యాషికా, నికాన్, కోనికా మినోల్టా, ఫ్యూజీ, మిచ్చిబిషీ, సోనీ, సామ్ సంగ్, పానసోనిక, కేనన్, కాషియో, కాన్టెక్ట, లైకా, ఆగ్ఫాఫోటో, ఇల్‌ఫర్డ్ ఫోటో, ఫ్యూజికా, పెన్‌టెక్స, బోలెక్స, హెచ్‌పి, లోవెూ, మినిక్స, వివిటార్, సిగ్మా కార్పొరేషన్, రీకో, రోలై, ప్రాక్టికా, జైస్, జెనిత్, మస్టిక సిస్టమ్స్, పోలరాయిడ్, లిన్‌ఫో, మినోక్స, అగ్లక్స, అషిఫ్లెక్స తదితరాల కంపెనీలు కెమెరాలను ప్రపంచానికి అందిస్తున్నాయి.
ప్రస్తుతం ఆధునిక ఫోటో ప్రపంచాన్ని డిజిటల్ టెక్నాలజీ ఎంతగా శాసిస్తున్నా... పలు కంపెనీలు అందిస్తున్న డిజిటల్ కెమెరాలు ఎన్ని వస్తున్నా... నెగిటివ్ ప్రాసెస్‌కు ధీటుగా వీటి క్వాలిటీ ఉండటం లేదన్నది నిపుణులు అభిప్రాయం. త్వరగా పనిపూర్తవుతోందని తప్ప ఫోటోగ్రఫీపై పూర్తిస్ధాయి అవగాహన డిజిటల్ ఫోటోగ్రఫీ వచ్చాక లేదనే చెప్పాలి. కనీసం లైటింగ్ విధానంపై పట్టు కూడా లేక పోవటం.. కనీసం ఫోటో తీసే యాంగిల్‌పై కూడా అవగాహన లేకుండానే నేడు ఫోటోగ్రఫీ విలవిలబోతోందన్నది నాటి తరం ఫోటోగ్రాఫర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఎప్పటికపðడు కొత్త పుంతలు తొక్కుతూ దినదిన ప్రవర్ధమానం చెందిన ఫోటోగ్రఫీ నేడు నిత్య జీవనంలో భాగమైపోయింది. జర్నలిజంలో ఫోటోలలే ప్రధాన పాత్ర, సినీ ప్రపంచంలో టెక్నాలజీ ఎంత మారుతున్నా నేటికి చాలా విషయాలలో ఫోటోగ్రఫీనే ఆధారంగా చేసుకుంటున్నారంటే ఆశ్చర్యం కలగకమానదు. టెలీస్కోప్‌ల సహాయంలో అంతరిక్షచిత్రాలను కూడా ఫోటోల రూపంలో మలచడంతో ఫోటోగ్రఫీకి ఎనలేని ప్రాధాన్యం ఏర్పడింది. మరోవైపు మైక్రో ఫోటోగ్రఫీ (మూక్రో లెన్స్‌తో కీటకాలు, చిన్న చిన్న వస్తువులు, కంటికి కనించని బాక్టీరియాలను చిత్రీకరించడం) అందుబాటులోకి వచ్చాక వైద్యరంగంలోనూ మార్పులకు తోడ్పడిందనే చెప్పాలి.
ఇక మన భారతదేశంలో అంతర్జాతీయ ఛాయాచిత్రకారుల కౌన్సిల్ చేసిన పలు తీర్మానాలకు అనుగుణంగా 1991 ఆగష్టు 19 నుండి ఫోటోగ్రఫీ నిర్వహిస్తున్నారు. మన రాష్ట్రంలోనూ ఫోటోగ్రఫీడే సందర్భంగా వివిధ అంశాలపై పోటీలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. జర్నలిస్ట్ అసోషియేషన్ తమ పోటీలను ఫోటో జర్న లిజం చేసే వారికి మాత్రమే పరిమితం చేయగా.. సమాచారం పౌరసం బంధాల శాఖ ప్రభుత్వ కార్యక్రమాలపై ఫోటోగ్రాఫర్లు తీసిన ఫోటోలను వివిధ విభాగాలలో పోటీ నిమిత్తం ఆహ్వానిస్తూ... ఔత్సాహికులను ప్రోత్సహిస్తోంది. ఏదిఎమైనా 64 కళల్లో ఒక్కటిగా ఛాయాచిత్రకళ నేటి తరాన్ని అలరిస్తోన్నది.