28, ఫిబ్రవరి 2011, సోమవారం

జగన్ ఆస్తులపై 'సభ'ని స్థంభింపజేస్తాo...

వైయస్ జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తులపైన పార్లమెంటులో జెపిసి మాదిరిగా ఇక్కడ జాయింట్ లెజిస్ట్రేటివ్ కమిటీ వేయాలని తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు దేవినేని ఉమామహేశ్వరరావు డిమాండ్ చేశారు. సోమవారం అసెంబ్లీలోని మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ.. సాక్షిలో దొంగ పెట్టుబడులు ఉన్నట్లు ఐటి శాఖ తేల్చి చెప్పిందని... అయినా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు ఉండటానికి గల కారణమేమిటని ప్రశ్నించారు.

జగన్ ఆస్తులపై ప్రభుత్వం జెఎల్‌పి వేయకుంటే శాసనసభా సమావేశాలను స్థంభింపజేస్తామని ఆయన హెచ్చరించారు. రాష్ట్రంలోనే ఇది అతి పెద్ద కుంభకోణమని అన్నారు.

మంత్రి పైకి దూసుకెళ్లిన ఎమ్మెల్యే

తెలంగాణ అంశంపై సోమవారం కూడా శాసనసభ దద్ధరిల్లింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకున్నది తెలుగుదేశం పార్టీయేనని, తెలంగాణను అడ్డుకున్నది ఎవరో బిజెపి అగ్రనేత అద్వానీ చెప్పారని తెలుగుదేశం పార్టీ సభ్యులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు.

కాంగ్రెసు, తెలుగుదేశం సభ్యుల మధ్య తీవ్ర వివాదం చోటు చేసుకుని ఉద్రిక్తతకు దారి తీసింది.ఓ దశలో శాసనసభా వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబుపైకి తెలుగుదేశం శాసనసభ్యుడు కొత్తకోట దయాకర్ రెడ్డి దూసుకెళ్లారు. ఆయనను కాంగ్రెసు సభ్యులు అడ్డుకునే ప్రయత్నం చేశారు.

తెలంగాణా వద్దన్నది చంద్రబాబే

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును చంద్రబాబే అడ్డుకున్నారని బీజేపీ నేత అద్వానీయే చెప్పారని.. తెలంగాణ విషయంలో కాంగ్రెస్ పార్టీని తప్పుబట్టే అర్హత చంద్రబాబునాయుడుకు లేదని మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు. సోమవారం ఆయన సభలో మాట్లాడుతూ తెలంగాణ ఏర్పాటు అంశం కేంద్రం పరిధిలో ఉందన్నారు. ఈ విషయంలో తమ చిత్తశుద్ధిని శంకించాల్సిన అవసరం లేదని..తెలంగాణా పై చంద్రబాబు ద్వంద్వ విధానం వీడి ఓ నిర్ణయం ప్రకటించాలని డిమాండ్ చేసారు

మాజీ సిఎం రోశయ్యపై కేసు పెట్టండి : హైకోర్టు

హైదరాబాదీ అత్యంత ఖరీదైన ప్రాంతం మైత్రివనంలోని స్థల వివాదంలో మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్యపై విచారణపై విధించిన స్టేని సోమవారం హైకోర్టు ఎత్తివేసింది. అమీర్పేట భూముల వ్యవహారానికి సంబంధించి రోశయ్యతోపాటు మరో 14 మందిపై కేసు నమోదు చేసి విచారణ జరపాలని ఎసిబిని హైకోర్టు ఆదేశించింది.దీనితో ఈ వ్యవహారంలో జరిగిన అధికార దుర్వినియోగం, తదితర అంశాలపై ఎసిబి విచారణ జరపనుంది.

రైల్‌రోకో జరిపి తీరుతాం...

రేపు తెలంగాణ జేఏసీ పిలుపు మేరకు జరగనున్న తెలంగాణ రైల్‌రోకోను విరమించుకోలేదని రాజకీయ ఐకాస ఛైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరామ్‌ స్పష్టం చేశారు. కార్యక్రమం యథావిధిగా కొనసాగుతుందని అన్నారు. రైల్‌ రోకో సందర్భంగా పట్టాలపైనే వంటా వార్పు చేయాలని ఆయన పిలుపునిచ్చారు. అలాగే మార్చి 10వ తేదీన తలపెట్టిన 'మిలి యనీర్‌ మార్చ్‌'లో ఎటువంటి మార్పు ఉండదని ఆయన తెలిపారు.

జైపాల్‌ హామీకి ప్రణబ్‌ ఎసరు ?

ఇప్పట్లో పెట్రో ధరలు పెంచే ప్రసక్తే లేదంటున్న ఆ శాఖ మంత్రి ఎస్‌.జైపాల్‌రెడ్డి హామీలకు కేంద్ర ఆర్థిక మంత్రి ప్రణబ్‌ ముఖర్జీ ఎసరుపెట్టారు. సోమవారం 2011-12 బడ్జెట్‌ ప్రవేశపెట్టిన సందర్భంగా ముఖర్జీ అన్నారు. బడ్జెట్‌లో కస్టమ్‌, ఎక్సైజ్‌ సుంకాలను యథాతథంగా కొనసాగించడంతో అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్‌లో బ్యారల్‌ ముడిచమురు ధరలు 110 యూఎస్‌ డాలర్లకు పెరిగింది. ఇది రెండేళ్ల గరిష్ట స్థాయికి సమానం.

ప్రస్తుతం పెట్రోల్‌, డీజిల్‌పై 7.5 శాతం కస్టమ్స్‌ డ్యూటీ విధిస్తున్నారు. అలాగే లీటర్‌ పెట్రోల్‌పై ఎక్సైజ్‌ డ్యూటీ రూ.14.35, డీజిల్‌పై లీటరుకు రూ.4.60 విధిస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్లలో చమురు ధరలు పెరుగడంతో పెట్రో ధర పెంచక తప్పడంలేదు.

ప్రణబ్ బడ్జెట్ ముఖ్యాoశాలు ఇవీ

ఆర్థిక శాఖ మంత్రి ప్రణబ్ ముఖర్జీ సోమవారంనాడు పార్లమెంటులో 2011-2012 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ప్రతిపాదనలు సమర్పించారు.

బడ్జెట్ ముఖ్యాoశాలు ఇవీ

-నల్లధనాన్ని వెలికి తీసేందుకు అయిదు అంచెల విధానం

-చేనేత రంగం ఉద్దీపనకు చర్యలు

-నాబార్డు ద్వారా రూ.3000 కోట్లు వితరణ

- 2011-12లో 7 నుంచి 8 లెదర్ హబ్స్ ఏర్పాటు

-నల్లధనం విదేశాలకు తరలకుండా ప్రత్యేక విధానం

-బ్లాక్ మనీ వెలికితీతకు చట్టం చేసే యోచన

- 15 మోగా ఫుడ్ పార్కుల ఏర్పాటు

-త్వరలో జాతీయ ఆహార భద్రతా బిల్లు

- 2012 ఏప్రిల్ 1 నుంచి ప్రత్యక్ష పన్నుల విధానం

-2.50 లక్షల గ్రామ పంచాయితీలకు గ్రామీణ ఇంటర్నెట్ సౌకర్యం

-అంగన్‌వాడీ కార్యకర్తల వేతనాలు పెంపు ( రూ.700 ఉన్నకార్యకర్తలకు రూ.1500, రూ.1500 ఉన్న కార్యకర్తలకు రూ.3000 చెల్లింపు)

-పప్పుధాన్యాల ఉత్పత్తి పెంచేందుకు 60వేల గ్రామాలకు రూ.300 కోట్లతో ప్యాకేజీ

-రూ.7,300 కోట్లు పట్టణాల దగ్గర

- రుణాలను సకాలంలో చెల్లించే రైతులకు పావలా వడ్డీకే రుణాలు

-పశుగ్రాస నివారణకు రూ.300 కోట్లు

- భారత నిర్మాణ రంగ కార్యక్రమానికి రూ.58వేల కోట్లు

-విద్యారంగానికి రూ. 52,057 కోట్లు

-విద్యాహక్కు చట్టం కింద మరో రూ.21 కోట్లు

-అట్టడుగున ఉన్న గిరిజనుల అభివృద్ధికి రూ.244 కోట్లు

- గ్రామీణ బ్యాంకుల స్థాపనకు రూ.500 కోట్లు

-ఆరోగ్య రంగానికు రూ.26, 760 కోట్లు

-చిన్న, సన్నకారురైతుల రుణాల కోసం ప్రత్యేక నిధి

-అసంఘటిత రంగాలలో స్వాలంభన పింఛన్ విధానం మరింత సరళీకృతం

-హరిత భారత్ పథకానికి రూ.200 కోట్లు

-రుణాల ఎగవేతను అరికట్టేందుకు ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు

- ఈ సమావేశాల్లోనే ఇన్సూరెన్స్ సవరణ , ఎల్‌ఐసీ బిల్లులు

-2వేలు జనాభా ఉన్న గ్రామాల్లో బ్యాంకుల ఏర్పాటు

-ఈ ఏడాది కొత్తగా 20వేల గ్రామాలకు బ్యాంకింగ్ సదుపాయం

-జమ్మూ కాశ్మీర్ అభివృద్ధికి రూ.8వేల కోట్లు

-వెనకబడిన ప్రాంతాల అభివృద్ధికి రూ. 9,890 కోట్లు

-ఐఐటీ ఖరగ్‌పూర్‌కు రూ.200 కోట్లు , ఐఐఎం కోల్‌కతాకు రూ.20 కోట్లు

-రక్షణ రంగానికి రూ.69,199 కోట్లు

- కొత్త గిడ్డంగుల ఏర్పాటుకు రూ.2వేల కోట్లు

-ముస్లిం వర్సీటీలకు రూ.50 కోట్లు

-గంగానది మినహా నదులు, సరస్సుల శుద్ధికి రూ.200 కోట్లు

-ముస్లిం యూనివర్శిటీలకు రూ.50 కోట్లు

-మ్యూచ్‌వల్ ఫండ్స్‌లో విదేశీ పెట్టుబడులు పెంపు

-వ్యక్తిగత పన్ను మినహాయింపు పరిమితి 1.8 లక్షలకు పెంపు

జూన్ నుంచి సెప్టెంబర్ వరకూ కులాల ఆధారంగా జనగణన

-ఇప్పటివరకూ 20 లక్షల ఆధార్ నెంబర్లు జారీ

- త్వరలో కొత్త రుపాయి నాణాలు.

- చిన్న, సన్నకారు రైతుల కోసం ప్రత్యేక నిధి