తెలంగాణా వద్దన్నది చంద్రబాబే
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును చంద్రబాబే అడ్డుకున్నారని బీజేపీ నేత అద్వానీయే చెప్పారని.. తెలంగాణ విషయంలో కాంగ్రెస్ పార్టీని తప్పుబట్టే అర్హత చంద్రబాబునాయుడుకు లేదని మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు. సోమవారం ఆయన సభలో మాట్లాడుతూ తెలంగాణ ఏర్పాటు అంశం కేంద్రం పరిధిలో ఉందన్నారు. ఈ విషయంలో తమ చిత్తశుద్ధిని శంకించాల్సిన అవసరం లేదని..తెలంగాణా పై చంద్రబాబు ద్వంద్వ విధానం వీడి ఓ నిర్ణయం ప్రకటించాలని డిమాండ్ చేసారు