రైల్‌రోకో జరిపి తీరుతాం...
రేపు తెలంగాణ జేఏసీ పిలుపు మేరకు జరగనున్న తెలంగాణ రైల్‌రోకోను విరమించుకోలేదని రాజకీయ ఐకాస ఛైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ స్పష్టం చేశారు. కార్యక్రమం యథావిధిగా కొనసాగుతుందని అన్నారు. రైల్ రోకో సందర్భంగా పట్టాలపైనే వంటా వార్పు చేయాలని ఆయన పిలుపునిచ్చారు. అలాగే మార్చి 10వ తేదీన తలపెట్టిన 'మిలి యనీర్ మార్చ్'లో ఎటువంటి మార్పు ఉండదని ఆయన తెలిపారు.