హైకోర్టు బెంచి రాత్రికి రాత్రి ఇవ్వలేమని న్యాయశాఖా మంత్రి మోపిదేవి వెంకట రమణ చేసిన వ్యాఖ్యలు అర్థం లేనివని.. పైగా పెద్దమనుష్యుల ఒప్పందం తెచ్చి చూపిస్తే పరిశీలిస్తాననడం ఆయన కప్పదాటు శైలిని తెలియజేస్తుందని బెజవాడ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు చలసాని అజయ్‌కుమార్ విమర్శించారు.దాదాపు 40 ఏళ్లుగా న్యాయవాదులు బెంచి ఏర్పాటుపై పోరాడుతూనే ఉన్నారన్న విషయం మంత్రికి గుర్తులేకపోవడం శోచనీయమన్నారు..
నిజంగా న్యాయవాదుల సమస్య పరిష్కరించాలని ప్రభుత్వానికి చిత్తశుద్ధి వుంటే కేబినెట్‌లో పెట్టి రాష్ట్రపతి నోటిఫికేషన్ ద్వారా బెంచి ఏర్పాటు చేయవచ్చునన్నారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి, న్యాయశాఖా మంత్రులు న్యాయ నిపుణులతో చర్చించి ఈ విషయంపై పరిశీలించాలని చలసాని డిమాండ్ చేశారు