అమెరికా అధ్యక్షుడు ఒబామా భారత్ పర్యటనకు నిరసనగా ఈనెల 9వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ తెలిపారు.
బుధవారం ఆయన మాట్లాడుతూ ఆర్‌బీఐ కమిటీ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకునేంతవరకూ ఎవరూ రుణాలు చెల్లించవద్దన్నారు. రాహుల్‌గాంధీతో ముఖ్యమంత్రి రోశయ్య సమావేశమై సూక్ష్మరుణాల సంస్థలపై చర్చించాలని నారాయణ డిమాండ్ చేశారు.