స్వల్పకాలిక రుణ వితరణ, స్వీకరణను ఆర్‌బిఐ మరోసారి పెంచింది. దీంతో బ్యాంకులు రుణాలపై వడ్డీ వడ్డనకు సన్నద్ధమవుతున్నా యి. గృహ రుణాలకు సంబంధించిన నిబంధనలను కూడా ఆర్‌బిఐ కఠినతరం చేసింది. ఇంటి విలువలో 80 శాతం కంటే మించి రుణాలు ఇవ్వరాదని బ్యాంకులను కోరింది.
గృహ రుణాల మంజూరులో ఖాతాదారులను ఆకర్షించడం కోసం మార్కెట్ రేటు కన్నా తక్కువ వడ్డీకి పలు బ్యాంకులు రుణాలు అందివ్వ డంపై ఆర్‌బిఐ ఆందోళన వ్యక్తం చేసింది. అలాంటి వాణిజ్య బ్యాంకులు ఈ రుణాలపై 2 శాతం రిజర్వు నిధిని ఏర్పాటు చేసుకోవాలని చెప్పింది. సేవింగ్స్ రేటుపై పరిమితి ఎత్తివేయడానికి సంబంధించి డిసెంబర్ నాటికి ముసాయిదా మార్గదర్శకాలు జారీ చేస్తామని ఆర్‌బిఐ తెలిపింది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి జిడిపి అభివృద్ధి రేటు 8.5 శాతంగానే ఉంటుందని ఆర్‌బిఐ భావిస్తోంది.