3, నవంబర్ 2010, బుధవారం

పదవులకోసం ఢిల్లీకి నేతల పరుగులు...అల్లాడుతున్న ప్రజలు

రాష్ట్రంలో ప్రస్తుత ప్రకృతి వైపరీత్యాల వల్ల అల్లాడుతున్న ప్రజలను రక్షించేందుకు సహాయక చర్యలు చేపట్టాల్సిన ప్రభుత్వం ఎక్కడా కానరావడంలేదని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు డాక్టర్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు విమర్శించారు. సహాయక చర్యలు చేపట్టకుండా పదవులకోసం ఢిల్లీకి పరుగులు పెట్టడాన్ని చూస్తుంటే రాష్ట్రంలో ప్రభుత్వం లేదేమోనన్న అనుమానం కలుగుతోందని ఆయన ఎద్దేవా చేశారు.

1996లో ఇలాగే ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజమండ్రి ప్రాంతంలో తాత్కాలిక సెక్రెటేరియేట్ ఏర్పాటుచేసి ప్రజలను, రైతులను ఆదుకున్నారని యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టారన్నారని.. గుర్తుచేశారు.

చంద్రబాబు పిలుపుమేరకు ప్రతి గ్రామంలో నష్టం అంచనాలను పరిశీలించి క్షేత్రస్థాయి నివేదికను పార్టీ తరఫున ప్రభుత్వానికి అందజేస్తామన్నారు.