పార్లమెంట్‌లో తెలంగాణ ఏర్పాటుపై కేంద్ర ప్రభుత్వం బిల్లు ప్రవేశపెడితే ఆ బిల్లును సమర్థిస్తూ మొట్టమొదటి ఓటు తానే వేస్తానని టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేత, ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు స్పష్టం చేశారు..
తెలంగాణ విషయంలో కాంగ్రెస్, టీఆర్ఎస్ దొంగనాటకమడుతున్నాయని, ఈ విషయంలో తెలుగుదేశంపార్టీ స్పష్టమైన వైఖరితో నిలబడిందని స్పష్టం చేశారు. ఇటీవల ఢిల్లీలో తెలంగాణ కోసం తాము చేసిన ఆందోళనను ఈ సందర్భంగా గుర్తు చేశారు. పార్లమెంట్‌లో అనేక బిల్లులపై చర్చించామని, ప్రజా వ్యతిరేక బిల్లులను వ్యతిరేకించామని తెలిపారు. అయితే పార్లమెంట్‌లో పూర్తి బలం కల్గిన కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ఏర్పాటుకు సంబంధించిన బిల్లు మాత్రం ప్రవేశపెట్టడం లేదని విమర్శించారు.
ప్రభుత్వ ఆదాయం గణనీయంగా పెరిగిన గ్రామాల అభివృద్ధికి నిధులు ఇవ్వటం లేదని, అవినీతి అక్రమాలు విఫరీతంగా పెరిగిపోయాయని దుయ్యబట్టారు.