కర్ణాటక రాష్ట్ర క్రికెట్ సంఘం (కేఎస్సీఏ) ఎన్నికల్లో భారత క్రికెట్ జట్టు మాజీ క్రికెటర్లు జవగళ్ శ్రీనాథ్, అనిల్ కుంబ్లే, వెంకటేష్ ప్రసాద్‌లు పోటీ చేయనున్నారు. ఈనెల 21వ తేదీన జరిగే ఈ ఎన్నికల్లో తాము పోటీ చేస్తున్నట్టు వెంకటేష్ ప్రసాద్ తెలిపారు. అయితే, రాహుల్ ద్రావిడ్ మాత్రం ఎన్నికల్లో పోటీ చేయరని, కేవలం పరిపాలనా వ్యవహారాల్లో మాత్రం సూచనలు ఇస్తూ పాలు పంచుకుంటారని తెలిపారు.
గత సెప్టెంబరు నుంతి జాకీయ క్రికెట్ అకాడెమీ ఛైర్మన్‌గా కుంబ్లే .. మ్యాచ్ రెఫరీగా శ్రీనాథ్ కొనసాగుతున్నారు. ఐపీఎల్ ఫ్రాంఛైజీలలో ఒకటైన చెన్నయ్ సూపర్ కింగ్స్ జట్టుకు వెంకటేష్ ప్రసాద్ బౌలింగ్ కోచ్‌గా ... రంజీ ... అండర్-17 జట్టుకు కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు.