ఊరంతా నీరు.. పొలాలే చెరువులుగా మారాయి..రోడ్లన్నీ కాల్వలయ్యాయి..లక్షలాది రూపాయల వ్యవసాయ మదుపులన్నీ నీట మునిగాయి... వందలు కాలు వేల ఎకరాలు పంట నాశనమయ్యింది..నాలుగు రోజులుగా కుండపోత వర్షం అన్నదాత కన్నీటి వానలో తడిసి ముద్దవుతున్నాడు.
బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి, ఈశా న్య రుతుపవనాల ప్రభావంతో అన్నదాత వెన్నులో వణుకు పుట్టించింది. చేతికి అందే సమయంలో వరి చేలు పూర్తిగా నాశనమైంది. ప్రకృతి కటాక్షంతో అనుకున్న అంచనాలకు మించి ఫలసాయం వ చ్చిందన్న ఆనందం పడుతున్న కొద్ది సమయానికే అదే ప్రకృతి కరాళనృత్యానికి పంటలన్నీ నాశనమయ్యాయి.
తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు పంట నష్టాల అంచనాలపై కమిటీని ఏర్పాటు చేయడంతో ఈ నెల ఆరో తేదీ నుంచి కమిటీ పర్యటించనున్నది. అన్నదాతల ఆక్రందన తెలుసుకుని పార్టీ అధినేతకు నివేదికలు ఇవ్వనున్నారు. ఈ మేరకు మంగళవారం అధినేత చంద్రబాబునాయుడు తెలుగుతమ్ముళ్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.