3, నవంబర్ 2010, బుధవారం

ప్రయోజనం లేకున్నా, సెంటిమెంట్‌కే ప్రాధాన్యత

కోట్ల విలువైన టపాకాసులను ప్రజలు రెండు రోజుల్లో కాల్చివేస్తారని అధికారి క అంచనా. నయాపైసా ప్రయోజనం లేకున్నా, సెంటిమెంట్‌కే ప్రాధాన్యతని స్తూ జనాల ప్రాణాలకు అధికారులు భద్రత లేకుండా చేస్తున్నారు.

అటు తమిళనాడులో ఇటు రాష్ట్రంలోనూ ఏటా టపాసుల తయారీ కేంద్రాల్లో జరిగే ప్రమాదాల కారణంగా ఎందరో వికలాం గులవుతున్నారు. అయినా సరే చేతులు కాలాకే ఆకులు పట్టుకుందామన్న చందంగా అధికారులు వ్యవహరిస్తున్నారు. ఏ నిబంధన పాటించకపోయినా, ప్రాణాలకు ముప్పు తెచ్చే టపాసుల వ్యాపారాల నిర్వహణకు అధికారులు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చేస్తున్నారు. ఇది ఎంతటి ప్రమాదకరమైన నిర్ణయమో ఘటన జరిగితే గానీ తెలుసుకోలేని మామూళ్ల మత్తులో ఆయా శాఖల అధికారులు మునిగిపోయారు.

అందరి ఇళ్లలో వెలుగులు నింపాల్సిన దీపావళి సంబరాలు ఏటా పదుల సంఖ్యలో కుటుంబాల్లో విషాదం నింపుతూనే ఉంది. క్షణికానందం కోసం, సంప్రదాయాన్నే వారసత్వంగా భావించే ప్రతి కుటుంబం వేలాది రూపాయలను మట్టిపాలు చేస్తున్నారు. ఎంత చెప్పినా చెవికెక్కని టపాసుల వ్యాపారం క్ర మబద్ధీకరణ కోసం ప్రభుత్వం కఠినమైన నిబంధనలు విధించింది. ఎట్టి పరిస్థితుల్లో చిన్న ప్రమాదం కూడా జరగకూడదనే కృతనిశ్చయంతో ఈ వ్యాపారాన్ని ఎక్స్‌ప్లోజివ్స్ యాక్ట్‌లో అనుసంధానం చేసింది. అక్రమంగా కలిగి ఉన్నా, అనుమతి లేకుండా స్టాక్ లేకున్నా నేరమేనని నిబంధనలు చెబుతున్నాయి.

ఎన్‌వోసీకి వెనుక ఎన్నో నిబంధనల అమలు దాగిఉంటుంది. జనవాసాలు ఉండకూడదు, పేలుడు పదార్థాలతో ప్రమాదానికి గురైతే ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా ఉండాలి. భవనం ఆ ప్రాంతంలో కనిపించకూడదు. ఏ చిన్న ఫిర్యాదు వచ్చినా పరిగణలోకి తీసుకోవాలి. ఎ లాంటి అనుమతులు లేని గోదాముల విషయంలో కఠినంగా వ్యవహరించా లి. అంతే వీరితో పాటు అగ్నిమాపక శా ఖ ఎన్‌వోసీ చాలా పకడ్బందీగా ఇవ్వాలి. ఏ ప్రమాదం వచ్చినా అగ్ని నిరోధించేందుకు చుట్టుపక్కల ఖాళీ ప్రదేశం, వాహనం రావడానికి దారి, నిరంతరంగా నీటి సరఫరా నిబంధనల్లో ప్రధానమైనవి...కనీసం క్వింటాలు పైబడి సరుకులు అమ్మే వ్యాపారి లక్ష లీటర్ల నీటి కెపాసిటీగల ట్యాంకులు గానీ ఇతర ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది.

నిర్ధేషించిన స్థలం మినహా మరేది కూడా చిన్న దుకాణం కూడా ఉండకూడదని చట్టం సూచిస్తోంది...అయితే ఏ ప్రాంతాల్లో సరుకు నిలువచేస్తున్నారో, విక్రయాలకు అనువైన నిబంధనలు ఏవి పాటిస్తున్నారనేది అఫిడవిట్ కూడా దాఖలు చేయలేదు. దీంతో బేషరతుగా వాటిని తిరస్కరించాల్సి ఉన్నా కొన్నింటికీ క్లియరెన్స్ ఇచ్చారనేది వాస్తవం. విక్రయాల విషయంలోనూ చిల్లర వ్యాపారులు ఎక్కడ పడితే అక్కడే కౌంటర్‌లు ప్రారంభించి విక్రయాలు సాగిస్తున్నా రు. విక్రయాల సమయంలో ఎన్నో ప్రమాదాలు జరిగినా అధికారులు చేసి న తప్పిదాన్ని కప్పిపుచ్చేందుకు చర్యలకు ఉపక్రమించడం లేదని విమర్శలు బాహాటంగానే వస్తున్నాయి.