14, నవంబర్ 2010, ఆదివారం

సినీ పరిశ్రమ రారాజు డీవీఎస్ రాజు

గులేబకావళి క«థ, గండికోట రహస్యం వంటి మహోజ్వల జానపద చిత్రాలు ఎన్నింటినో నిర్మించిన డీవీఎస్ రాజు మృతి పశ్చిమ గోదావరి వాసులను కలచివేసింది. . వివాద రహితుడిగా నిరాండంబరుడిగా రారాజుగా వెలుగొందిన డీవీఎస్.రాజు పూర్తి పేరు దాట్ల వెం కట సూర్యనారాయణరాజు.

1928లో పోడూరు మండలం కవిటం లో జన్మించారు.. ఆయన తండ్రి దాట్ల బలరామరాజు, రాజకీయ దురంధరుడిగా పేరుపొందారు. 1962 నుంచి రెండు సార్లు నర్సాపురం నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహించారు. ఆయన తండ్రి వారసత్వంతో చిన్నప్పుడే ప్రతిభను పుణికిపుచ్చుకున్నారు. కాకినాడ పీఆర్ కళాశాలలో చదువు పూర్తయ్యాక వ్యా పారం నిమిత్తం మద్రాసు వెళ్లి అనూహ్యంగా సినీ పరిశ్రమలో స్థిరపడ్డారు.

1950లో సినోలితో వర్క్స్ పేరుతో వా ల్‌పోస్టర్ ముద్రణ సంస్థను ప్రారంభించిన ఆయన పిచ్చి పుల్లయ్య సినిమా పోస్టర్ ముద్రణ సమయంలోనే ఎన్టీ రామరావుతో పరిచయం కలిగింది. ఆ పరిచయంతో ఎన్‌టిఆర్ సోదరుడు త్రివిక్రమరావు ప్రారంభించిన ఎన్ఏటి సం స్థలో భాగస్వామి అయ్యి తోడు దొంగలు, జయసింహ, పాండురంగ మహత్యం, గులేబకావళి వంటి చిత్రాలను నిర్మించారు.

1964లో తన సొంత సంస్థ డీవీఎస్ఎన్ ప్రొడక్షన్ ప్రారంభించి మంగమ్మ శపధంతో జైత్రయాత్రను ప్రారంభించారు. గండికోట ర హస్యం, గులేబకావళిక«థ, తిక్క శంకరయ్య, మాబాబు, ధనమా దైవమా, పిడుగు రాముడు వంటి 25 చిత్రాలను నిర్మించారు. 1975లో జీవన జ్యోతి సినిమా ఉత్తమ చిత్రంగా నంది అవార్డుlanu అందుకున్న ఆయన సినీ దక్షిణ భార త చలనచిత్ర మండలికి గౌరవ కార్యదర్శిగా పదేళ్లు పనిచేశారు.

1977లో దక్షిణ భారత చలనచిత్ర మండలికి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టాక ఆయన కృషితోనే చలనచిత్ర మండలి ఏర్పడింది. ఈ మండలి ప్రారంభించిన ఫిలిం ఇనిస్టిట్యూట్‌లో సూపర్‌స్టార్ రజనీకాంత్, చిరంజీవీ వంటి ఎందరో శిక్షణ పొందిన వారే.

1978లో ఫిల్మోత్సవం నిర్వహించిన రాజు గారు 1984-89 మధ్య ఏబీ చలనచిత్ర అభివృద్ధి సంస్థ అధ్యక్షుడిగా పనిచేశారు. రెండోసారి 1990లో ఎన్నికయారు. ఫిలిం డెవల ప్‌మెంట్ కార్పొరేషన్ తొలి అధ్యక్షుడి గా పనిచేశారు.
1989లో రఘుపతి వెంకయ్య అవార్డు, 1995లో తమిళ పరిశ్రమ గ్రిష్మా పురస్కారం పొందారు. ఆయనను పద్మశ్రీ అవార్డు వరించింది. పలు హోదాల్లో చలనచిత్ర రంగానికి, కళాకారులకు, సామాజిక సేవ కార్యక్రమాలకు సహకరించారు.

తండ్రి బలరామరాజు పార్లమెంటు సభ్యుడిగా పశ్చిమ గోదావరి జిల్లా అభివృద్దికి కారకుడు అయితే సినీ పరిశ్రమలో అగ్రగణ్యుడుగా డీవీఎస్ రాజు వెలుగొందడం గర్వకారణం.